Anjali : నా జీవితంలో ఇలా చేయడం ఇదే మొదటిసారి

Anjali : అంజలి ఈ తెలుగు హీరోయిన్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలతో మంచి గుర్తింపును సాధించుకొని తెలుగు ప్రేక్షకుల మనసులో ఒక స్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది. అంజలి చేసిన చాలా సినిమాలు తెలుగులో మంచి హిట్ అయ్యాయి. అంజలి సినిమాలో కనిపిస్తే అచ్చమైన తెలుగు అమ్మాయిల చక్కగా మాట్లాడుతుంది కాబట్టి చాలామంది ఆవిడకి కనెక్ట్ అవుతారు.

Anjali

సీత పాత్ర ప్రత్యేకం

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన సినిమా సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సినిమాలో సీత అనే పాత్రలో కనిపించింది అంజలి. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించుకుంది. ఇక ఈ సినిమాలో అంజలి పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇంట్లో చకచకా అన్ని పనులు చేసే ఒక అమ్మాయిల ఈ సినిమాలో కనిపిస్తోంది. ఈ సినిమాలో అంజలిని చూస్తే చాలామంది పర్సనల్గా బాగా కనెక్ట్ అవుతారు అని చెప్పొచ్చు.

- Advertisement -

లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా

అంజలి స్టార్ హీరోస్ సినిమాలు చేయటమే కాకుండా లేడి ఓరియంటెడ్ సినిమాలో కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎన్నో లేడి ఓరియెంటెడ్ సినిమాలను అంజలి చేసింది. ఇకపోతే కోన వెంకట్ నిర్మించిన గీతాంజలి సినిమా అంజలి కెరియర్లో బెస్ట్ అని చెప్పొచ్చు. హర్రర్ జోనర్ వచ్చిన ఈ సినిమా, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే రీసెంట్ గా ఈ సినిమాకి సీక్వెల్ గా గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమాను కూడా చేశారు. అయితే ఈ సినిమాకి ఊహించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు.

ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు

ఇకపోతే అంజలి ప్రస్తుతం చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులో నటిస్తుంది. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనుకున్న ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది. ఇక ఈ సినిమాతో పాటు అంజలి నటిస్తున్న సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి.

రత్నమాల పాత్రలో మొదటిసారి

ఇకపోతే కృష్ణచైతన్య దర్శకుడుగా విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న గాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో రత్నమాల అనే పాత్రలో కనిపించనుంది అంజలి. అయితే ఈ పాత్రలో చాలా బోల్డ్ గా కనిపిస్తుంది అంజలి. ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి పాత్ర తను చేయలేదని, అలానే ఈ సినిమాలో వాడిన కస్ వర్డ్స్ తన కెరీర్ లో ఇంతకుముందు ఎప్పుడు వాడలేదు అని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఈ సినిమా మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. యువన్ శంకర్రాజ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు