Cannes 2024 : ఇండియన్ సినిమాను తలెత్తుకునేలా చేసిన కన్నడ మూవీ… కేన్స్ లో విన్నర్ గా సన్ ఫ్లవర్

Cannes 2024 : భారతీయ దర్శకుడు చిదానంద ఎస్ నాయక్ రూపొందించిన సన్‌ఫ్లవర్స్ వర్ ది ఫస్ట్ ఒన్స్ టు నో అనే చిత్రం కేన్స్ 2024లో బెస్ట్ షార్ట్‌గా మొదటి స్థానంలో నిలిచి, అత్యున్నత గౌరవాన్ని అందుకుంది. గురువారం అంటే మే 23న జరిగిన 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో చిదానంద్ ఎస్ నాయక్ చిత్రం ‘సన్‌ఫ్లవర్స్ వర్ ది ఫస్ట్ ఒన్స్ టు నో’ లా సినెఫ్ మొదటి బహుమతిని గెలుచుకుంది. కేన్స్‌లో భారత్‌కు అరుదైన విజయం, గర్వకారణం. చిదానంద్ పూణేలోని ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా టెలివిజన్ విభాగంలో తన ఒక సంవత్సరం పని చేసిన సమయంలో ఈ చిత్రాన్ని రూపొందించారు.

సన్‌ఫ్లవర్స్ కు కేన్స్ లా సినీఫ్ అవార్డ్

ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII)కి చెందిన చిదానంద ఎస్ నాయక్ రూపొందించిన ‘సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్స్ టు నో’ అనే పేరుతో రూపొందించిన షార్ట్ ఫిల్మ్ 2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో లా సినెఫ్ పోటీ విభాగానికి ఎంపికైంది. తాజాగా దీనికి సంబంధించిన స్క్రీనింగ్ పూర్తి కాగా, డైరెక్టర్ చిదానంద ఎస్ నాయక్ రూపొందించిన సన్‌ఫ్లవర్స్ వర్ ది ఫస్ట్ వోన్స్ 17 ఇతర చిత్రాలతో పోటీ పడి విజయం సాధించారు. ప్రపంచవ్యాప్తంగా లా సినీఫ్ అవార్డ్ కోసం 555 ఫిల్మ్ స్కూల్స్ నుండి 2,263 ఫిలిమ్స్ ను పంపగా, అందులో 18 చిత్రాలు మాత్రమే షార్ట్ లిస్ట్ అయ్యాయి. అందులో చిదానంద మూవీ విన్నర్ గా నిలవడం విశేషం.

Cannes 2024: 'Sunflowers Were The First Ones To Know' By India's Chidananda S Naik Wins La Cinef First Prize

- Advertisement -

సెకండ్, థర్డ్ విన్నర్స్

రెండవ స్థానంలో కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన అస్య సెగలోవిచ్ దర్శకత్వం వహించిన అవుట్ ఆఫ్ ది విడో త్రూ ది వాల్, గ్రీస్‌లోని అరిస్టాటిల్ యూనివర్శిటీ ఆఫ్ థెస్సలోనికికి చెందిన నికోస్ కొలియోకోస్ రూపొందించిన ది ఖోస్ షీ లెఫ్ట్ బిహైండ్ నిలిచాయి. ఇదే విభాగంలో మాన్సీ మహేశ్వరి రూపొందించిన బన్నీహుడ్ మూడో బహుమతిని కైవసం చేసుకుంది. మీరట్‌కు చెందిన మాన్సి మహేశ్వరి, లండన్‌లోని నేషనల్ ఫిల్మ్ టెలివిజన్ స్కూల్ (NFTS)లో బన్నీహుడ్‌ని గ్రాడ్యుయేషన్ ప్రాజెక్ట్‌గా చేసింది.

విన్నర్స్ కు బహుమతి ఏంటంటే?

కేన్స్ లా సినీఫ్ అవార్డ్ లో మొదటి బహుమతి అందుకున్న వారికి 15,000 యూరోలు (రూ. 13,49,068), రెండవ బహుమతికి 11,250 యూరోలు (రూ. 10,11,801), మూడవ బహుమతికి 7,500 యూరోలు (6,74,534) బహుమతిగా ఇస్తారు.

సన్ ఫ్లవర్స్ స్టోరీ

డైరెక్టర్ చిదానంద ఈ మూవీ గురించి మాట్లాడుతూ “మాకు కేవలం నాలుగు రోజుల టైమ్ ఉన్నప్పుడు ఈ మూవీని రూపొందించము. దీన్ని కర్ణాటకలో జానపద కథల ఆధారంగా తెరకెక్కించాం. ఇవి మేము పెరుగుతూ విన్న కథలు. కాబట్టి నా చిన్నప్పటి నుంచే నాకు దీని గురించి బాగా తెలుసు” అన్నారు.

ఇక స్టోరీలోకి వెళ్తే.. 16 నిమిషాల ఈ షార్ట్ ఫిలిమ్ ఆత్మవిశ్వాసం దొంగిలించే ఓ వృద్ధురాలి గురించి. ఆమె అందరి ఆత్మవిశ్వాసాన్ని తీసేసుకుని గ్రామాన్ని అంధకారంలో ముంచేస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు