Pushpa 2 Update : పుష్ప 2 రిలీజ్ ఆలస్యం కావడానికి అల్లు అర్జునే కారణం… ఏం చేశాడో ఎవ్వరూ ఊహించలేరు

Pushpa 2 Update : మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ పుష్ప 2 ఆలస్యం అవుతూ అవుతూ ఎట్టకేలకు ఆగస్టు 15న రిలీజ్ కావడానికి ఫిక్స్ అయ్యింది. అయితే ఈ మూవీ ఆలస్యం కావడానికి ఎన్నో రీజన్లు ఉన్నప్పటికీ అల్లు అర్జున్ కూడా ఒక ముఖ్య కారణం అనే విషయం తాజాగా బయటకు వచ్చింది. అసలు అల్లు అర్జున్ ఏం చేశాడు? అనే ఇంట్రెస్టింగ్ విషయంలోకి వెళ్తే…

బన్నీనే అంతా చేశాడు…

పుష్ప 2 మూవీ రిలీజ్ ఆలస్యం కావడం ఆయన అభిమానులను చాలావరకు ఇబ్బంది పెట్టింది. ఈ ఏడాది మూవీ లవర్స్ అత్యంత ఆసక్తిగా ఎదురు చూసిన సినిమాలలో పుష్ప 2 ముందు వరసలో ఉంటుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ ఛేంజ్ అవ్వడానికి, ఆలస్యం గురించి ఎన్నో రూమర్లు చక్కర్లు కొట్టాయి. కానీ అసలు కారణం ఏంటో ఎవరికీ తెలియదు. ఇక ఆ రీజన్స్ లో అల్లు అర్జున్ కూడా ఒకరు. ఆయన వేరే ఓ సినిమాకు కమిట్ అవ్వడం వల్లే పుష్ప 2 మూవీ షూటింగ్ ఇంత ఆలస్యమైనట్టుగా తెలుస్తోంది.

చైనీస్ సినిమాలో అల్లు అర్జున్…

తాజాగా సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఓ చైనీస్ మూవీలో నటించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. సక్ర అనే మూవీతో అల్లు అర్జున్ చైనీస్ సినిమాలోకి ఎంట్రీ ఇచ్చాడని అంటున్నారు. ఈ మూవీ కారణంగానే అల్లు అర్జున్ కొన్ని రోజులు పుష్ప 2ను పక్కన పెట్టేసాడని, అందుకే షూటింగ్ ఆలస్యం కావడంతో పాటు ఆగస్టుకి వాయిదా పడిందని అనుకుంటున్నారు మూవీ లవర్స్. ప్రస్తుతం దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. జిన్ యోంగ్ రాసిన వుక్సియా నవల ‘డెమి-గాడ్స్ అండ్ సెమీ-డెవిల్స్’ ఆధారంగా తెరకెక్కిన ‘సక్రా’తో అల్లు అర్జున్ నటించాడనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ చిత్రం 2023లో చైనీస్ న్యూ ఇయర్ సందర్భంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలైంది.

- Advertisement -

నిజం ఏంటంటే?

ప్రస్తుతం వైరల్ అవుతున్న సక్రా చిత్రబృందంలో అల్లు అర్జున్ కూడా ఉన్నట్టు కన్పిస్తోంది. కానీ అది నిజం కాదు. ఎవరైనా ఆ ఫోటోను ఎడిట్ చేశారా? లేదంటే ఎక్కడైనా పొరపాటున వచ్చిందో తెలీదు. కానీ అభిమానులను మాత్రం ఆశ్చర్యంలో ముంచెత్తింది ఆ స్క్రీన్ షాట్.

పుష్ప 2 ఆలస్యం?

ఈ నెలలో అల్లు అర్జున్ సినిమా షూటింగ్ పూర్తి చేయనున్నాడు. జూన్ నాటికి మిగిలిన షూటింగ్ పూర్తి అవుతుంది. కాబట్టి సినిమా ఆలస్యం అయ్యే అవకాశం లేదు అని మేకర్స్ రీసెంట్ గా క్లారిటీ ఇచ్చారు. మూవీని అనుకున్న తేదీన రిలీజ్ చేయడానికి విదేశాల సెట్లను ఇండియాలోనే నిర్మించి శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు.

రామోజీ ఫిల్మ్ సిటీలో అంతర్జాతీయ లొకేషన్ సెట్‌లు

డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీ విదేశీ షెడ్యూల్ ను రద్దు చేయాలని నిర్ణయించుకున్నాడని టాక్ నడుస్తోంది. దాని బదులుగా మలేషియా, జపాన్, బ్యాంకాక్‌ లాంటి ప్రదేశాలను ప్రతిబింబించేలా హైదరాబాద్‌లో భారీ సెట్‌లను నిర్మించమని ఆయన ఆర్ట్ డైరెక్టర్‌ ని కోరినట్టు తెలుస్తోంది. ఈ సెట్‌లను రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మించనున్నారు. సీజీఐని ఉపయోగించి, విజువల్స్ ను సెట్ చేయబోతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు