Pragya Jaiswal: పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్‌ అయిందా ?

Pragya Jaiswal: ‘కంచె’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన భామ ప్రగ్యా జైస్వాల్. వరుణ్ తేజ్ సరసన సీతగా నటించి అభిమానులను మెప్పించింది. ఆ సినిమా తర్వాత ‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ ఉన్నా ఈమెకు సరైన అవకాశాలు రాలేదు. ఆ సినిమా క్రెడిట్ మొత్తం బాలయ్య బాబుకు, బోయపాటి శ్రీనుకు వెళ్లిపోయింది. ఆ తర్వాత సరైన ఆఫర్లు లేకపోవడంతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా మారింది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోతో కుర్రకారు మతులు పోగొడుతోంది.

లేటెస్ట్‌గా మ్యాంగోలు తింటూ ఫోటోలకు ఫోజులిచ్చింది. సొగసుల తలపులు తెరిచేసి క్యూట్‌గా మ్యాంగోస్ తింటూ హీటెక్కించేలా కవ్వించింది. ఇన్‌స్టాలో ఆమె షేర్ చేసిన ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుని, ఎల్లో కలర్ రింగ్ పెట్టుకుని, లేలేత ఎల్లో కలర్​ మ్యాంగోలు తింటూ తనదైన స్టైల్‌లో మెస్మరైజ్ చేసింది.

ఇంత వరకూ బాగానే ఉన్నా.. ఈ ఫోటోలకు నెటిజన్లు పెడుతున్న కామెంట్లు చూస్తే అమ్మ బాబోయ్ అనిపించక మానదు. ‘క్యూట్ డ్రెస్ క్యూట్ ఫేస్ బ్యూటిఫుల్ స్మైల్’ అని ఒకరు కామెంట్ పెడితే మరొకరు ‘మ్యాంగోని కూడా అంత అందంగా తినాలా?’ అంటూ చిలిపిగా క్వశ్చిన్ చేశాడు. మరో కుర్ర ఫ్యాన్ అయితే ఏకంగా ప్రగ్యా జైస్వాల్‌… మరీ అంత సిగ్గుపడుతూ మ్యాంగోస్ తింటున్నావ్.. నువ్వు ఏమైనా ప్రెగ్నెంట్‌వా ?’ అంటూ తికమక ప్రశ్న వేశాడు.

- Advertisement -
Pragya Jaiswal

ఇక ప్రగ్యా జైస్వాల్ కెరీర్ విషయాన్ని వస్తే.. ఎంత పెద్ద బ్లాక్ బస్టర్స్ ఉన్నా ఈమెకు సరైన అవకాశాలు రావడం లేదు. తెలుగులో ‘మిర్చిలాంటి కుర్రాడు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా క్రిష్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘కంచె’ మూవీతోనే కాస్త గుర్తింపు లభించింది. ఆ తర్వాత ‘ఓం నమో వేంకటేశాయ’, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకి నాయకా, ఆచారి అమెరికా యాత్ర తదితర సినిమాల్లో నటించిన సరైన బ్రేక్ మాత్రం రాలేదనే చెప్పాలి. ‘అఖండ’ సినిమా హిట్ కొట్టినప్పటికీ ఈమెకు మాత్రం ఆ విజయం ఏ మాత్రం ఉపయోగపడలేదు అనే చెప్పాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు