Coolie on OTT: షూటింగ్ కూడా స్టార్ట్ కాకముందే కూలీ ఓటీటీ లోకి !

Coolie on OTT : ప్రస్తుతం థియేటర్లోకి వస్తున్న సినిమాలన్నీ నెల రోజులు కూడా కాకముందే ఓటిటిలో రిలీజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు థియేటర్లలోకి రావడానికి రెడీగా ఉన్న సినిమాలు ఓటీటీలోకి ఎప్పుడొస్తాయో అనే చర్చ ముందుగానే మొదలవుతుంది. మోస్ట్ అవైటింగ్ సినిమాలకు సంబంధించిన ఓటిటీ రైట్స్ ను ఏ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ సొంతం చేసుకుంది? ఎప్పుడు ఆ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది? అనే విషయాలపై ముందుగానే ఆరా తీస్తున్నారు. తాజాగా రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ కాకముందే ఆ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ గురించి చర్చ మొదలైంది. మరి కూలీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకుంది ? ఎప్పుడు ఓటీటీ లోకి రాబోతోంది అనే ఇంట్రెస్టింగ్ విషయంలోకి వెళ్తే…

కూలీ రైట్స్ ఏ ఓటీటీ సంస్థకు?

సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఇప్పటికీ అదిరిపోయే రేంజ్ లో ఫ్యాన్ బేస్ ఉంది. గత ఏడాది జైలర్ మూవీతో బ్లాక్ స్టార్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న సూపర్ స్టార్ ఫుల్ జోష్ తో నెక్స్ట్ సినిమాలు చేస్తున్నారు. ఆయన నెక్స్ట్ మూవీ గురించి అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అందులోనూ ప్రత్యేకంగా రజనీకాంత్ కెరీర్లో 171వ చిత్రంగా రాబోతున్న కూలీ గురించి ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శర వేగంగా పూర్తవుతోంది.

Coolie: Why Rajinikanth bringing back the film title is significant in  today's India Tamil Movie, Music Reviews and News

- Advertisement -

రజనీకాంత్ తన 170 సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, రీసెంట్ గా దుబాయ్ ట్రిప్ కి వెళ్లారు. అక్కడ గోల్డెన్ వీసా అందుకుని, దుబాయ్ షేకుల ఆతిథ్యం స్వీకరించి మళ్లీ ఇండియాకు రిటర్న్ అయ్యారు రజనీకాంత్. త్వరలోనే కూలి మూవీ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. ఇక ఈ క్రమంలోనే కూలి మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్టుగా తెలుస్తోంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను పాపులర్ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్నట్టుగా సమాచారం.

వివాదంలో టైటిల్ టీజర్…

ఇప్పటికే కూలి మూవీకి సంబంధించిన టైటిల్ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. పైగా సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే ఆ టీజర్ లో తన మ్యూజిక్ ను వాడుకున్నారు అంటూ మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా చిత్ర బృందానికి నోటీసులు పంపించి షాక్ కి ఇచ్చారు. అనుమతి లేకుండా తన మ్యూజిక్ వాడుకున్నారని, అనుమతి తీసుకోవాలని లేదంటే ఆ మ్యూజిక్ ని టీజర్ నుంచి తొలగించాలని ఆయన ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

అయితే ఈ వివాదంపై చిత్ర బృందం ఇప్పటిదాకా స్పందించలేదు. ఇక రజనీకాంత్ కాంట్రవర్సీ నిర్మాతలకు, మ్యూజిక్ డైరెక్టర్ కు మధ్య ఉందని, వాళ్లే పరిష్కరించుకుంటారని కామెంట్ చేసి వదిలేసారు. మరి ఇప్పుడు ఈ వివాదం సమసిపోయిందా? లేదంటే ముందు ముందు చిక్కులు తెచ్చి పెడుతుందా ? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు