OTT Movie : ఆడవాళ్ళకు ఫ్రీడం వస్తే… ప్రతీ అబ్బాయీ చూడాల్సిన అమ్మాయిల కథ

OTT Movie : ఆడవాళ్లు జీవితాంతం శాలరీ లేకుండా పని చేసే పని మనుషులు, వంటింటి కుందేళ్ళు ఇలా ఎన్నో మాటలు మనం విన్నాము. కొన్ని సినిమాల్లో చూసాం కూడా. నిజానికి ఓ వైపు మహిళా మణులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎదుగుతుంటే, మరోవైపు మాత్రం కొంత మంది ఇంకా వంటిళ్లలోనే మగ్గిపోతున్నారు. ఫ్యామిలీ కోసం తమ ఇష్ట ఇష్టాలను త్యాగం చేసి అసంతృప్తితో బతుకుతున్నారు. నిజానికి అమ్మాయిలు ఫ్రీడం కోరుకుంటే ఎలా ఉంటుంది? అనే ఈ ఫీల్ గుడ్ సిరీస్ ను కచ్చితంగా అందరూ చూడాల్సిందే. ముఖ్యంగా అబ్బాయిలు. మరి మంచి రిప్రెషన్ ఫీలింగ్ ఇచ్చే ఈ వెబ్ సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? ఆ సిరీస్ పేరేంటో చూసేద్దాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న వెబ్ సిరీస్ పేరు స్వీట్ కారం కాఫీ. ఈ సిరీస్ లో మూడు తరాల మహిళల కథను ఆసక్తికరంగా చూపించారు. ఇందులో లక్ష్మీ, మధుబాల, శాంతి బాలచంద్రన్, వంశీ కృష్ణ, జై బాబు తదితరులు కీలక పాత్రలో నటించి తమ నటనతో మెప్పించారు. 60 ఏళ్ల బామ్మ, 40 ఏళ్ల అమ్మ, 20 ఏళ్ల అమ్మాయి కలిసి స్వేచ్ఛను కోరుకుంటూ ఎలాంటి ప్రయాణం చేశారు ? అనేదే ఈ సిరీస్ స్టోరీ. వాళ్ళ మనసులోని భావాలు, ఫ్రీడమ్ వస్తే ఏం చేస్తారు అనే విషయాలను మనసుకు హత్తుకునేలా చూపించారు.

Prime Video: Sweet Kaaram Coffee - Season 1

- Advertisement -

అబ్బాయిలకైతే ఈ సిరీస్ ను చూశాక కనువిప్పు కలుగుతుంది. ముఖ్యంగా అమ్మాయిలు అంటే వంటింట్లోనే ఉండాలి అనుకునే మగవాళ్లకు. అమ్మాయిలకైతే నిజమే కదా అని కాసేపు ఎమోషనల్ గా ఫీల్ అవుతారు. ఈ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఇప్పటిదాకా ఎవరైనా చూడకపోతే ఈ వీకెండ్ ఓ లుక్ వెయ్యండి. కచ్చితంగా మంచి సిరీస్ చూసాము అనే సంతృప్తి కలుగుతుంది.

కథలోకి వెళ్తే..

రాజా రత్నం, కావేరి భార్యాభర్తలు. తన తల్లి సుందరితో పాటు ఇద్దరు పిల్లలతో మధ్యతరగతి జీవితాన్ని గడుపుతాడు రాజా రత్నం. ఆయన కొడుకు పేరు బాల, కూతురు నివేదిత. సుందరి ఇంట్లోనే ఉంటుంది. కావేరి ఇంట్లో అందరి పనులు తలపై వేసుకొని బిజీ బిజీగా ఉంటుంది. బాల సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు. నివేదిత క్రికెట్ ఆడాలని ట్రైనింగ్ తీసుకుంటుంది. కానీ ఇంట్లో ఆడవాళ్ళు ఒక్కరు కూడా సంతోషంగా ఉండరు. ఏదో ఒక అసంతృప్తితో ఉంటారు. ఓ రోజు సడన్ గా సుందరితో పాటు కావేరి నివేదిత కలిసి ఇంట్లో మగవాళ్ళకి చెప్పకుండా గోవా ట్రిప్ కి వెళ్ళిపోతారు. ముగ్గురూ కలిసి ఇలాంటి పని ఎందుకు చేశారు ? ఇంట్లో మగ వాళ్లకు ఈ విషయాన్ని ఎందుకు చెప్పలేదు ? వాళ్లకు ప్రయాణంలో ఎదురైన ఇబ్బందులు ఏంటి ? ఇంటికి అసలు తిరిగి వచ్చారా ? అనే విషయాలు తెలియాలంటే స్వీట్ కారం కాఫీ అనే ఈ అద్భుతమైన సిరీస్ ను చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు