OTT Movie : ఈ రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేశారో చచ్చారే… నరకం స్పెల్లింగ్ రాయించే హార్రర్ మూవీ

OTT Movie : సోషల్ మీడియాను ఎక్కువగా వాడుతూ అపరిచితుల ఫ్రెండ్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసే వాళ్ల కోసమే ప్రత్యేకంగా ఈ మూవీ సజెషన్. ఈ సినిమాను చూసిన తర్వాత ఇంకోసారి అలా చేయాలంటే వెన్నులో వణుకు పుడుతుంది. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? మూవీ పేరేంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

అమేజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

హర్రర్ మూవీస్ ని ఇష్టపడే వారికి ఈ మూవీ బెస్ట్ సజెషన్. గతంలో చాలామంది ఫేస్బుక్ ను ఏదో వ్యసనంలో ఉపయోగిస్తూ ఉండేవారు. ఆ ఫేస్బుక్ అడిక్షన్ థీమ్ గా తీసుకొని ఫ్రెండ్ రిక్వెస్ట్ అనే మూవీని రూపొందించారు డైరెక్టర్ సైమన్ వర్హోవన్. 2016 లో రిలీజ్ అయిన ఈ మూవీ హాలీవుడ్ లో రూపొందిన భయంకరమైన హారర్ సినిమాల్లో టాప్ లో ఉంటుంది. క్షణక్షణానికి ఏం జరుగుతుందో అనే ఆసక్తితో పాటు ఒక్కసారిగా వచ్చే ట్విస్టులతో ఉలిక్కిపడేలా చేస్తుంది ఈ మూవీ. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

With laughable dialogue and ankle-deep message, 'Friend Request' misses its mark | Central Mo News

- Advertisement -

స్టోరీ లోకి వెళ్తే…

మారినా చనిపోయింది అంటూ ప్రొఫెసర్ క్లాస్ లోకి వచ్చి అనౌన్స్ చేస్తాడు. అయితే ఆ స్టూడెంట్ సూసైడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిందని, దానిని స్కూల్లో ఎవరైనా షేర్ చేస్తే సస్పెండ్ చేస్తానని హెచ్చరించి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఫేస్బుక్ కు అడిక్ట్ అయిన లారా అనే అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయికి ఓ రోజు మరీనా నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంది. అడిక్షన్ లో పడిపోయిన లారా అసలు ఏం జరుగుతుందో ఆలోచించకుండా మరీనా రిక్వెస్ట్ ను వెంటనే యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకేముంది అప్పటినుంచి దయ్యం మరీనా లారాను ఇబ్బంది పెడుతూ ఉంటుంది. లారా పుట్టిన రోజున ఉదయాన్నే మరీనా వీడియో కాల్ చేసి విష్ చేస్తుంది. పార్టీ గురించి అడగ్గా లారా తాను బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్తున్నానని అబద్ధం చెప్తుంది. కానీ లారా ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుంటుంది అన్న విషయం మరీనాకు తెలిసి క్యాంటీన్ లో గొడవ పడుతుంది.

ఆ తర్వాత సడన్ గా మరీనాకు బట్టతల ఉందన్న విషయం బయటపడి అక్కడున్న స్టూడెంట్స్ అంతా నవ్వుతారు. దీంతో మరీనాను అన్ ఫాలో చేస్తుంది లారా. ఆ తర్వాత రోజే మరీనా ఆత్మహత్య చేసుకుందన్న విషయాన్ని ప్రొఫెసర్ బయట పెడతాడు. మరీనా చనిపోయిన రోజు రాత్రి లారాకు మెసేజ్ వస్తుంది. ఓపెన్ చేసి చూస్తే అందులో మరీనా  ఆత్మహత్య చేసుకుంటున్న భయంకరమైన సంఘటన కనిపిస్తుంది. ప్రయత్నించినా అది డిలీట్ అవ్వదు. పైగా లారా ఫేస్బుక్లో వీడియో అప్లోడ్ అవుతుంది. దీంతో పోలీసులు మరీనా ఆత్మహత్యతో లారాకు సంబంధం ఉందని అనుమానిస్తారు. ఇక ఆ తర్వాత లారా ఫ్రెండ్స్ లో ఒక్కొక్కరిని చంపేస్తుంది మరీనా. మరి మరీనా ఎవరు? లారా దెయ్యం నుంచి ఎలా తప్పించుకుంది? అనే విషయాలు తెలియాలంటే ఫ్రెండ్ రిక్వెస్ట్ మూవీ ని చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు