OTT Movie : మనుషులకే తెలీకుండా మనిషి మాంసాన్ని అమ్మే దంపతులు… వీక్ హార్ట్ ఉన్నవాళ్లు మాత్రం చూడొద్దు

OTT Movie : నరమాంస భక్షకుల గురించి ఇప్పటిదాకా మనం ఎన్నో సినిమాలు చూసాం. అయితే ఇటీవల కాలంలో ఇలాంటి సినిమాలు ఎక్కువగా వస్తుండడంతో వైలెన్స్ ఎక్కువగా ఉన్నా సరే ఈ మూవీని సస్పెన్స్ కేటగిరీలో జత చేస్తున్నాయి ఓటీటీలు. సపరేట్ జోనర్ గా ఈ సినిమాలను అందిస్తున్నారు. అయితే మనిషి మాంసం గురించిన సినిమాల్లో రక్తపాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలామంది వాటిని తెరపై చూడడానికి ఇష్టపడరు. కానీ ఇలాంటి సినిమాలు కూడా ఇంట్రెస్టింగ్ గా చూసే మూవీ లవర్స్ ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారి కోసమే ఈ మూవీ సజెషన్. ఈ మూవీ ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది? టైటిల్ ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

యాపిల్ టీవీలో స్ట్రీమింగ్

ఇటీవల కాలంలో ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక భాష అనేది అడ్డు కాకుండా పోయింది. ఏ భాషలో రిలీజ్ అయిన మూవీనైనా సరే ఇంగ్లీష్ లో చూడగలిగే సదుపాయం ఉంటుంది. ఈ మూవీ కూడా అలాంటిదే. ఒరిజినల్ గా ఫ్రెంచ్ లో తెరకెక్కిన ఈ సినిమాను సమ్ లైక్ ఇట్ రేర్ అనే టైటిల్ తో ఇంగ్లీష్ లో కూడా చూసే అవకాశం ఉంది. నిజంగానే ఒక డిఫరెంట్ మూవీని చూడాలి అనుకునేవారు ఈ మూవీని యాపిల్ టీవీలో వీక్షించవచ్చు.

Some Like It Rare | 2022 | UK Trailer | French Dark Comedy

- Advertisement -

కథలోకి వెళ్తే…

బ్రెయిన్, సోఫియా ఇద్దరూ భార్యాభర్తలు. వాళ్ళకి నివాసం ఉంటున్న టౌన్ లో మాంసం అమ్మే షాప్ ఉంటుంది. అయితే ఎంత ప్రయత్నించినా బిజినెస్ బాగా నడవకపోవడంతో బాధపడుతూ ఉంటారు. అయితే కొంతమంది వెజిటేరియన్స్ మాంసం అమ్మకూడదు అంటూ వీళ్ళ షాప్ పై దాడి చేస్తారు. తాము ఎవరో తెలియకూడదు అని ముసుగులు వేసుకుని ఇలాంటి పని చేస్తారు. అయితే దాడి చేస్తున్న వ్యక్తుల్లో ఒకరి మొహాన్ని చూసిన బ్రెయిన్ అతన్ని గుర్తు పెట్టుకుంటాడు. ఓ రోజు బయటకు వెళ్ళి తిరిగి వస్తుండగా ఆ యువకుడు మళ్ళీ కనిపిస్తాడు. అయితే సడన్ గా కార్ బ్రేక్ వేయడం వల్ల కార్ వెనక ఉన్న అతను దానికి గుద్దుకుని అక్కడికక్కడే మరణిస్తాడు. దీంతో ఏం చేయాలో తెలీక అతన్ని తమ షాప్ కు తీసుకెళ్లి ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఫ్రిజ్లో పెట్టేస్తారు.

అయితే సోఫియా ఆ మాంసాన్ని అమ్మడం మొదలు పెడుతుంది. అయితే అసలు విషయం తెలియని జనాలు మాంసం బాగుందంటూ మళ్ళీ మళ్ళీ షాప్ కి వస్తారు. ఈ షాకింగ్ ఘటన తర్వాత బ్రెయిన్ మాంసం బిజినెస్ పెరుగుతుంది అన్న ఆశతో ఆ మాంసాన్ని అమ్మడం మొదలు పెడతాడు. ఇంకేముంది అప్పటినుంచి మనుషుల మాంసం అమ్మాలని డిసైడ్ అవుతారు. కానీ వీళ్ళ ప్లాన్ వర్క్ అవుట్ అవ్వదు. మరి మనిషి మాంసానికి మరిగిన జనాల కోసం, తమ బిజినెస్ ను డెవలప్ చేసుకోవడం కోసం ఈ భార్యాభర్తలు ఏం చేశారు? అనే ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలియాలంటే మూవీని చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు