OTT Movie : వరుస హత్యల కేసులో దెయ్యాలపై పోలీసుల ఇన్వెస్టిగేషన్… స్పైన్ చిల్లింగ్ థ్రిల్లింగ్ మూవీ

OTT Movie : సాధారణంగా హారర్ మూవీస్ అనగానే కళ్ళు మూసుకున్నా భయపెట్టే దెయ్యంతో పాటు సినిమాపై సీన్ సీనుకూ మరింత ఆసక్తిని పెంచే సస్పెన్స్, థ్రిల్లింగ్ వంటి అంశాలు కచ్చితంగా ఉంటాయి. అయితే ఇన్నాళ్లు మనకు దెయ్యం సినిమాలను కేవలం ఒకే విధంగా చూపిస్తూ వచ్చారు మేకర్స్. ఎవరికైనా దెయ్యం పట్టడం, దానిని ఎలా వదిలించాలి అనేది తెలుసుకోవడం, దెయ్యాన్ని వెళ్ళగొట్టడం లేదా ఆ దయ్యానికి ఓ బ్యాక్ గ్రౌండ్ స్టోరీ ఉండడం, చివరకు కోరిక తీరి తానంత తానుగా వెళ్లిపోవడం. ఇదే మనం ఇన్నాళ్లు చూసిన దెయ్యం స్టోరీ. లేదంటే కొన్ని మాత్రం మరింత రాక్షసంగా ప్రవర్తిస్తూ అందరినీ బలి తీసుకుంటాయి. ఏదేమైనా చివరకు దెయ్యాన్ని వెల్లగొట్టడానికి ఏదో ఒక దారిని కనుక్కోవడం కామన్. కానీ ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ మాత్రం చాలా విభిన్నంగా ఉంటుంది. మరి ఈ రోజు మూవీ సజెషన్ ఏంటి ? ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే విషయం తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్…

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్నది మూవీ గురించి కాదు వెబ్ సిరీస్ గురించి. ఈ సిరీస్ పేరు దెమ్ ది స్కేర్. టైటిల్ కు తగ్గట్టుగానే స్కేరీగా ఉంటుంది. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక్కసారి చూడడం స్టార్ట్ చేశారంటే కంప్లీట్ గా అయ్యేదాకా ఆపరు. ఒక్కో సీన్ కి సినిమాపై ఆసక్తి పెరగడంతో పాటు ట్విస్ట్ కూడా ఉంటుంది.

Them: The Scare (Season 2) – Review | Prime Video Horror Series | Heaven of Horror

- Advertisement -

కథ ఏంటంటే?

సినిమా మొత్తం ఓ హత్య గురించి ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ డిపార్ట్మెంట్ చుట్టూనే తిరుగుతుంది. సిటీలో వరుస హత్యలు జరుగుతాయి. అనుకోని ఈ ఘటనతో జనాలు భయపడిపోతారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. అయితే ఎలాంటి ఆధారాలు దొరకపోవడంతో ఈ కేసును టేకప్ చేసిన డిటెక్టివ్ కి విచిత్రమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఆమె మెదడులో ఉన్న ప్రశ్నలకు అస్సలు సమాధానం దొరకదు.

ముందుగా ఫాస్టర్ హోమ్ ను చూసుకునే అమ్మాయి హత్యతో మొదలవుతుంది ఈ స్టోరీ. అయితే ఆ హత్యతో మొదలుకొని ప్రతి హత్యకి టీవీలు, వీడియోలు లింక్ అయ్యి ఉంటాయి. దీంతో డిటెక్టివ్ కు సమస్య ఏంటో అసలు అర్థం కాదు. అసలు వాళ్ళు ఏం చూస్తూ చచ్చిపోతున్నారు? ఎందుకు హత్య జరిగిన ప్రతిచోటా ఇలా టీవిలు ఉంటున్నాయి? అనే ప్రశ్నలకు డిటెక్టివ్ కి సమాధానం దొరకదు. అయితే ఒక విషయంపై మాత్రం క్లారిటీ వస్తుంది. ఇదంతా మనుషులు మాత్రం చేయట్లేదు అని తెలుసుకుంటుంది. కానీ దయ్యాలు ఉన్నాయి అనే విషయాన్ని ఆమె అస్సలు ఒప్పుకోదు. ఇక ఇన్వెస్టిగేషన్ చేస్తున్న నేపథ్యంలోనే ఒకసారి ఎదురైన షాకింగ్ అనుభవంతో దెబ్బకి మనసు మార్చుకుంటుంది. దెయ్యాలు ఉన్నాయని నమ్మడంతో పాటు ఈ సమస్యని ఆమె ఎలా సాల్వ్ చేసింది? అనేది ఈ సిరీస్ స్టోరీ. హారర్ మూవీ లవర్స్ ఈ సిరీస్ ను చూసి కచ్చితంగా థ్రిల్ అవుతారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు