OTT Movie : దెయ్యాలకు పాఠాలు చెప్పి చంపే టీచర్… ఇదెక్కడి హార్రర్ మూవీరా మావా!?

OTT Movie : ఇటీవల కాలంలో కొరియన్ సిరీస్ లు, సినిమాలు చూసే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా కరోనా టైంలో ఓటిటిలకు, కొరియన్ సినిమాలకు డిమాండ్ పెరిగింది. అలా కొరియర్ సినిమాలను ఇష్టపడే వారికి ప్రత్యేకంగా అనిపించేలా ఓ హర్రర్ మూవీ సజెషన్ ను తీసుకొచ్చాము. ఈ మూవీ సస్పెన్స్ తో పాటు హర్రర్ థ్రిల్లింగ్ అంశాలతో నిండి ఉంటుంది. మరి ఈ మూవీ టైటిల్ ఏంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే వివరాల్లోకి వెళితే…

ఫ్రీగా చూడవచ్చు

సాధారణంగా హర్రర్ సినిమాలను స్థానిక భాషలోనే చూడడానికి ఎవరైనా ఇష్టపడతారు. కానీ కొత్తగా ఇతర భాషల్లో హర్రర్ మూవీలను చూసి థ్రిల్ అవ్వాలి అనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ హాంగ్ కాంగ్ ఘోస్ట్ స్టోరీస్. ఇక మరో గుడ్ న్యూస్ ఏమిటంటే ఈ మూవీని ఫ్రీగా చూడొచ్చు. నిజానికి ఈ హారర్ ట్రైలర్ మూవీ అనే మూబీ అనే ఓటీటీలో అందుబాటులో ఉంది. కానీ ఇది మన తెలుగు వాళ్లకు అందుబాటులో లేదు కాబట్టి యూట్యూబ్ లో చూసేయండి. స్టోరీ లైన్ ఏంటంటే ఆ క్లాస్ రూమ్ లో ఉండే విద్యార్థులందరూ దయ్యాలే. ఈ విషయం తెలిసినప్పటికీ టీచర్ క్లాస్ చెప్తుంది.

Ghost Stories Hong Kong Deals | tech3.com

- Advertisement -

కథలోకి వెళ్తే…

కొత్తగా స్కూల్లో టీచర్ గా జాయిన్ అయిన జెన్నిఫర్ కు ఆ స్కూల్ లో అన్నీ వింత సంఘటనలే ఎదురవుతాయి. ఇప్పుడు క్లాస్ చెప్పబోయే స్టూడెంట్స్ బాగా అల్లరి చేస్తారని నోట్ పెట్టి ఉంటుంది. ఆ తర్వాత క్లాస్ కి వెళ్లి చూస్తే పిల్లలు అంతా విపరీతంగా అల్లరి చేస్తూ కనిపిస్తారు. అయితే జెనీఫర్ అస్సలు పట్టించుకోకుండా క్లాస్ చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఓ రోజు బాత్రూంకి వెళ్ళిన జెన్నిఫర్ కి డోర్స్ అన్ని లాక్ అవడం లాంటి భయంకరమైన సంఘటనలు ఎదురవుతాయి. అయితే లేట్ అయినప్పటికీ జెన్నీఫర్ ఇంటికి రాకపోవడంతో ఆమె తండ్రి పోలీసులను తీసుకుని ఆ స్కూల్ కి వెళ్లి తనను ఇంటికి తీసుకెళ్తాడు. ఆ తర్వాత కూడా జెనీ ఫోర్ స్కూల్ కి వెళ్తుంది.

మరుసటి రోజు స్కూల్ కి వెళ్తే అదే క్లాసులో స్టూడెంట్స్ దెయ్యాల్లా కనిపిస్తారు. పైగా పారిపోవడానికి ప్రయత్నిస్తున్న జెన్నిఫర్ ను ఆపి క్లాస్ చెప్పమంటారు. ఇక ఆ తర్వాత ఈ సంఘటనతో భయపడిన జెన్నిఫర్ ఒక మాంత్రికుడు దగ్గరికి వెళ్తే అతను మ్యాజిక్ కత్తిని ఇస్తాడు. ఇంటికి వచ్చి చూస్తే ఆమె తల్లిదండ్రులు కనిపించరు. సడన్ గా ఓ స్టూడెంట్ ఫోన్ చేసి జెన్నీఫర్ తల్లి తమ దగ్గరే ఉందని చెప్పడంతో స్కూల్ కి వెళ్తుంది. ఆమె చూస్తుండగానే కిటికీలో నుంచి ఆమె తల్లిని తోసేస్తారు. వెంటనే ఆ కోపంతో జెనీఫర్ కత్తిని తీసుకొని అక్కడున్న దయ్యాలను చంపేస్తుంది. కానీ ఇది మాత్రం క్లైమాక్స్ కాదు. మరి చివరికి ఏం జరిగిందో తెలియాలంటే హాంగ్ కాంగ్ ఘోస్ట్ స్టోరీస్ మూవీని చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు