Jahnvi Kapoor: ఆ మోజులో నా కెరీర్ నాశనమైంది.. జాన్వి సంచలన వ్యాఖ్యలు..!

Jahnvi Kapoor

బాలీవుడ్ స్టార్ కిడ్ జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ధడక్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జాన్వి.. మిలీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత వచ్చిన సినిమా అవకాశాలన్నీ ఓకే చేయకుండా ఆచితూచి అడుగులేస్తుంది ఈ భామ. ముఖ్యంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆకట్టుకుంటుంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో రాణిస్తుంది. ఇక ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న “దేవర” సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులని పలకరించనుంది జాన్వి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనలోని నటనను మరింత మెరుగుపరుచుకునేందుకు.. విలక్షణ నటిగా ప్రూవ్ చేసేందుకు ఎంతగానో ఆరాటపడుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం కెరీర్ పట్ల సంతృప్తి గానే ఉన్నానని పేర్కొంది. తనలోని నటనా సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు సవాల్ చేసే పాత్రలను ఎంచుకోవాలని అనుకుంటున్నట్లుగా చెప్పింది.

అంతేకాకుండా ముఖ్యంగా కామెడీ క్యారెక్టర్ల కోసం ఎదురుచూస్తున్నానని తెలిపింది జాన్వి. స్క్రీన్ పై డ్యాన్స్ చేస్తూ అందంగా కనిపిస్తున్నప్పటికీ ఎక్కడో సహజమైన నటన మిస్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుందని పేర్కొంది. ఈ క్యారెక్టర్ల మోజులో పడి తన కెరీర్ ని దెబ్బతీసుకున్నానని.. మొత్తానికి తనలోని నటనను మరింత మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు