Reba Monica John: యంగ్ హీరోతో హీరో శ్రీవిష్ణు హీరోయిన్ డేటింగ్ ?

Reba Monica John

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు ఇటీవల “సామజవరగమన” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా రూ. 60 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. సరైన హిట్ లేక సతమతమవుతున్న శ్రీ విష్ణు కెరియర్ కు ఇది మంచి బూస్ట్ ఇచ్చింది. ఈ సినిమా చూసి చాలా ఏళ్ల తర్వాత మూవీ లవర్స్ కడుపుబ్బా నవ్వుకున్నారు.

జూన్ 23న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ మొదటి రోజు నుంచి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అల్లు అర్జున్, రవితేజ వంటి స్టార్ హీరోలు కూడా ఈ మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇది ఇలా ఉండగా, సామజవరగమన సినిమాతో ఎంతోమంది ఫ్యాన్స్ ను సంపాదించుకుంది హీరోయిన్ రేబా మోనిక జాన్. అయితే ఆమెకు మలయాళంలో ఫస్ట్ అవకాశం దొరికింది. నవీన్ పోలి హీరోగా తెరకెక్కిన ‘జాకో బిండె స్వర్గరాజ్యం’ అనే సినిమాతో రేబా వెండితెరకు పరిచయమైంది.

ఆ తర్వాత రేబా తెలుగులో సామజవరగమనతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రేబాను ఒక స్టార్ హీరో డేట్ కి పిలిచారట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ చేసింది. ఆ స్టార్ హీరో ఎవరు అనే విషయం మాత్రం చెప్పలేదు. కానీ ఒకసారి హీరో తనని డేట్ కి పిలవడం మాత్రం నిజమే అంటూ అంగీకరించింది. అయితే ఎవరు ఎవరినైనా సరే డేట్ కు పిలవచ్చు కదా, అందులో తప్పేమీ లేదు కదా అని ఆమె అభిప్రాయంగా తెలియజేయడం జరిగింది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు