KushiMusicalConcert: సమంత.. నాగ చైతన్యను ఇంకా మర్చిపోలేకపోతుంది- అందుకే అలా..?

KushiMusicalConcert

టాలీవుడ్ లో లవబుల్ కపుల్ గా ఉండే సమంత, నాగ చైతన్యల గురించి అందరికి తెలిసిందే. చాలా రోజుల పాటు ప్రేమించుకొని, పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్ని మనస్పర్థల కారణంగా పరస్పర ఇష్టంతో విడాకులు తీసుకొని విడిపోయారు.

2021 లో నాగ చైతన్య తో సమంత విడిపోయాక.. ఆమె వరుస సినిమాలతో బిజీ అయింది. అటు నాగ చైతన్య కూడా వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. అయితే వీరిద్దరూ విడిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటున్న కూడా పలు సందర్భాలలో ఒకరి మీద ఒకరికి ఉన్న ఇష్టం బయట పడుతూ వస్తుంది.

ఇటీవలనే నాగ చైతన్య నటించిన కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో సమంత గురించి చెబుతూ.. సమంత సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు. అలాగే సమంతతో తాను విడిపోవడానికి కారణం కూడా ఒక రకంగా బయట వచ్చిన రూమార్సే అని చెప్పకనే చెప్పాడు. దాంతో సమంత , నాగ చైతన్యలకు వ్యక్తిగతంగా పెద్దగా గొడవలు ఏమి లేవు అనేది తెలుస్తుంది.

- Advertisement -

ఇక సమంత కూడా పలు సందర్భాలలో నాగ చైతన్య పై తనకున్న ఇష్టాన్ని బయటపెడుతూ వస్తుంది. లేటెస్ట్ గా ఆమె నటించిన ఖుషి సినిమా మ్యూజికల్ కన్సర్ట్ కి హాజరైన ఆమె విజయ్ దేవరకొండతో డాన్స్ చేసి ప్రేక్షకులను అలరించింది. ఆ తరువాత తన స్పీచ్ తో కూడా అందరిని ఆకట్టుకుంది. అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది.

కానీ ఖుషి సినిమా మ్యూజికల్ కన్సర్ట్ లో ఆమె మాత్రం ఒక పాటను ప్రముఖ సింగర్ పాడుతున్నప్పుడు మాత్రం సమంత లోపలి నుంచి వచ్చే దుఃఖాన్ని, బాధను కంట్రోల్ చేసుకున్నట్టు ఆమె ఎక్స్ ప్రెషన్స్ ద్వారా బయట పడ్డాయి. అయితే ఆ పాట నాగ చైతన్య సమంత నటించిన మజిలీ సినిమాలో పాట కావడంతో ఆమెకు నాగ చైతన్య గుర్తొచ్చి ఆమె ఆలా ఫీల్ అయిందని ప్రస్తుతం అందరు సమంత వీడియోస్ పై సోషల్ మీడియాలో మిమ్స్ వేస్తూ హల్చల్ చేయడం చేసారు. సమంత, నాగ చైతన్యలు మళ్ళీ కలవాలని అంత కోరుకుంటున్నట్టు ఈ కపుల్ పై వాళ్ళకి ఉన్న ఇష్టాన్ని బయటపెడుతున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు