Kushi : సమంత మీద నాగచైతన్య రివెంజ్..?

Kushi

అక్కినేని నాగచైతన్య – సమంత గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. 2017 అక్టోబర్ 7వ తేదీన వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత ఈ జంటకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంతగానో పెరిగిపోయింది. టాలీవుడ్ లో మోస్ట్ లవ్ అబుల్ కపుల్ గా పేరు పొందారు సామ్ – చైతు. కానీ 2021 లో అకస్మాత్తుగా ఇద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. ఆ తరువాత వీరిద్దరూ ఎవరి కెరీర్ లో వారు దూసుకుపోతున్నారు. వీరిద్దరూ భార్యాభర్తలు గా ఉన్నప్పుడు ఇద్దరి కాంబినేషన్ లో మజిలీ సినిమా తెరకెక్కింది.

ఈ సినిమాకి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. అయితే ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారు. ఇక సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రానికి కూడా శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే విడాకులు తీసుకున్నప్పటి నుండి సమంత నాగచైతన్యను కవ్వించడానికి ప్రయత్నిస్తూ వస్తుందనే టాక్ ఉంది. ఇప్పుడు శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ భార్యగా నటించడం కూడా అందులో భాగమనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తుంది.

అయితే ఈసారి సమంతపై రివెంజ్ కి ప్లాన్ చేశాడట నాగ చైతన్య. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు చైతు. ఈ సినిమా పూర్తయిన వెంటనే శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. సమంత సినిమాకి దర్శకత్వం వహించిన శివ నిర్వాణ దర్శకత్వంలో ఇప్పుడు చైతు ఓ సినిమా ఓకే చేయడం అంటే సమంతను కవ్వించడమే అన్నట్టుగా ఇండస్ట్రీ వర్గాలలో ఓ చర్చ ప్రారంభమైంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు