Nithin new movie: పవన్ కళ్యాణ్ డైరెక్టర్ తో నితిన్

Nithin new movie

హిట్స్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ పోయే నితిన్ కు ఇటీవల కాలంలో వరుస ఫ్లాప్ లు వస్తుండటంతో ఇక నుంచైన నితిన్ తాను చేసే సినిమాల విషయంలో కాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రెండు మూడు సినిమాలతో బిజీ గా ఉన్న నితిన్ లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ తో ఒక సూపర్ హిట్ సినిమాని డైరెక్ట్ చేసిన దర్శకుడితో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు

వివరాల్లోకి వెళ్తే .. నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ అనే సినిమాలో నటిస్తున్నాడు. చాలా రోజుల నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు కూడా ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమా తరువాత వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు నితిన్. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన భీష్మ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలున్నాయి. ఇక ఈ రెండు సినిమాలు ఇంకా ప్రొడక్షన్ లో ఉండగానే మూడో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నితిన్.

అయితే నితిన్ చేయడబోయే ఆ మూడో సినిమా డైరెక్టర్ మరెవరో కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ సినిమా అయిన వకీల్ సాబ్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన వేణు శ్రీరామ్. వకీల్ సాబ్ సినిమా తరువాత కాస్త గ్యాప్ తీసుకున్న వేణు శ్రీరామ్. ఇటీవలనే ఆయన వకీల్ సాబ్ చిత్రానికి సీక్వెల్ గా వకీల్ సాబ్ పార్ట్ 2 పనుల్లో ఉన్నానని తెలపగా. ఆయన వ్యాఖ్యలు వైరల్ అయ్యారు. అయితే ప్రస్తుతం రీమేక్ సినిమాల పరిస్థితి అంతంత మాత్రమగానే ఉండటంతో ఆయన వకీల్ సాబ్ సీక్వెల్ ను పక్కన పెట్టేసి, ప్రస్తుతం ఆయన నితిన్ సినిమా చేయబోతున్నట్టు ఒక వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.ఇక ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించబోతున్నాడట. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా రానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు