Venu Sriram: అనుకున్నది ఒకరు… చేస్తుంది మరొకరు

ఇండస్ట్రీలో అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని పట్టాలెక్కవు. కొన్ని సినిమాలు డిస్కషన్ స్టేజ్ లో ఆగిపోతే, ఇంకొన్ని సినిమాలు అఫీషియల్ అనౌన్స్ చేసిన తరువాత కూడా ఆగిపోతాయి. ఇది కేవలం స్టార్ హీరోల మధ్య మాత్రమే కాదు యంగ్ హీరోల సినిమాలకు కూడా జరుగుతుంది. అప్పుడు ఉన్న ఎక్సెట్మెంట్ లో సినిమా ఒక హీరోతో అనౌన్స్ చేయడం, అది ఇంకో హీరో చేయడం జరుగుతుంది.
ఈ ధోరణి ఎప్పటినుండో ఉంది కానీ, ఈ మధ్య సోషల్ మీడియా అధికం అవ్వడం వలన ఇప్పుడు చాలామందికి తెలుస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి తన 150 వ సినిమాను పూరి జగన్నాథ్ తో చేస్తున్నట్లు అప్పట్లో అమితాబ్ బచ్చన్ , ఆర్జీవీ సమక్షంలో అధికారికంగా ప్రకటించారు. అలానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కూడా సినిమాను చేస్తున్నట్లు “వినయ విధేయ రామ” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చారు మెగాస్టార్. కానీ ఇవేవీ పట్టాలెక్కలేదు, ఆ అనౌన్స్ మెంట్స్ తరువాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య , గాడ్ ఫాదర్ , వాల్తేరు వీరయ్య రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు భోళా శంకర్ రిలీజ్ కి సిద్దమవుతుంది.

డైరెక్టర్ సుకుమార్ , మహేష్ కాంబినేషన్ లో వచ్చిన “1” సినిమా ఫెయిల్ అయినా తరువాత, వీరి కాంబినేషన్ లో మరో సినిమాను అనౌన్స్ చేసారు. అది కాస్తా క్యాన్సిల్ అయిపోయి వీరిద్దరూ వేర్వేరు సినిమాలు పూర్తిచేశారు.

- Advertisement -

రీసెంట్ టైమ్స్ లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్ చెయ్యబోయే సినిమా కూడా విజయ్ చెంతకు చేరింది. ఇప్పుడు వినిపిస్తున్న కథనాల ప్రకారం ఇంతకుముందు వేణు శ్రీరామ్ , అల్లు అర్జున్ కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన “ఐకాన్” సినిమా ఇప్పుడు నితిన్ చెంతకు చేరనుందట. నితిన్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడేటట్లు ఈ కథలో మార్పులు చేస్తున్నాడట వేణు. ఇకపోతే నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశీ , వెంకీ కుడుమల దర్శకత్వంలో సినిమాలు చేస్తున్నాడు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు