Boyapatirapo: అక్కడ తప్పించుకున్నా, ఇక్కడ ఇరుక్కున్నాడు..?

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక ఊర మాస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బోయపాటి స్టైల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఒక మాస్ థండర్ గా తెరకెక్కతుండగా దసరా కానుక గా ఈ సినిమాను విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ తొందరగా కంప్లీట్ అవ్వడం వల్ల అనుకున్న టైమ్ కన్నా ముందే వస్తున్నామనని సెప్టెంబర్ 15న తమ సినిమాను విడుదల చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు.

అయితే పోటిలోంచి తప్పుకున్న బోయపాటిరేపో సినిమా తమ సినిమాను వినాయక చవితి సందర్భంగా పోటీ లేకుండా ఫ్రీ గా విడుదల చేద్దామని అనుకున్నారు. అయితే అదే ఈ సినిమాకు మరింత కష్టం గా మారుతుంది. సెప్టెంబర్ లో ఈ సినిమాతో పాటు మరో ఐదు పాన్ ఇండియా సినిమాలు విడుదల కానున్నాయి. ఇందులో జూన్1 న విజయ్ సమంతల “ఖుషి” విడుదల అవుతుంది. ఆ తర్వాత జూన్7న షారుఖ్ ఖాన్ అట్లీ కాంబో లో వస్తున్న జవాన్ రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన వారం రోజులకు అనగా జూన్15 న “బోయపాటిరాపో” సినిమా విడుదల కానుంది.
అదే రోజు సిద్ధూ జొన్నలగడ్డ నటించిన “టిల్లు స్క్వేర్” కూడా విడుదల అవుతుంది.

ఈ సినిమాలు విడుదలైన సరిగ్గా రెండు వారాలకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న “సలార్” వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవనుంది. అయితే దసరా పోటీనుండి తప్పుకున్న బోయపాటి రామ్ సినిమా సెప్టెంబర్ లో ఇరుక్కుపోయింది. దీనికి వరం ముందు వస్తున్న జవాన్ సినిమా వల్ల ఈ సినిమాకి నార్త్ థియేటర్లు దక్కకపోగా, తెలుగు స్టేట్స్ లో కొన్ని థియేటర్లను దీనితో పాటే రిలీజ్ అవుతున్న టిల్లు స్క్వేర్ ఆక్రమించుకుంటుంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా సెప్టెంబర్ 28న విడుదలవుతున్న “సలార్” రామ్ బోయపాటి సినిమా థియేటర్లను భారీగా ఆక్రమించుకుంటుంది. అందువల్ల రామ్ సినిమాకి లాంగ్ రన్ ఆడే స్కోప్ ఉండదు. మరి ఈ సినిమాల రిలీజ్ కి ఇంకా రెండు నెలల సమయం ఉండడంతో ఏ సినిమా అయినా పోస్టుపోన్డ్ అవుతుందేమో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు