Box office: మొదటివారానికే ముగింపు పలుకుతున్న ఆదిపురుషుడు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఆదిపురుష్ వరల్డ్ వైడ్ గా జూన్ 16న విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆదిపురుష్ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ వచ్చినప్పటి నుండి నెగిటివ్ రెస్పాన్స్ నే సొంతం చేసుకున్నా, ట్రైలర్, పాటలు బాగుండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. రామాయణం కథ కావడంతో కామన్ ఆడియన్స్ కూడా ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలన్న ఆసక్తి వచ్చింది.

అయితే ఈ సినిమా విడుదలయ్యాక అన్ని ఏ ఒక్క అంచనాలని కూడా అందుకోలేకపోగా తీవ్ర విమర్శల పాలయ్యింది. రామాయణాన్ని చెడగొట్టారని ఈ సినిమా రైటర్ పై, డైరెక్టర్ పై పబ్లిక్ తమ తిట్లతో దుమ్మెత్తి పోశారు. అయితే రామాయణం ఎలా తీశారో ఆసక్తితో నార్త్ లో, ప్రభాస్ కల్ట్ ఫ్యాన్ బేస్ తో తెలుగు స్టేట్స్ లోను ఆదిపురుష్ ఓపెనింగ్స్ అదరగొట్టింది. మూడు రోజుల్లో మూడు వందల కోట్లు వసూలు చేసి ఔరా అనిపించిన ఈ సినిమా తర్వాత ఏ రకంగానూ ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించలేకపోయింది. మొదటి వారంలో వీకెండ్ మినహా మిగతా నాలుగు రోజులు కేవలం 62 కోట్లు వసూలు చేసింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో 7వ రోజు ఆదిపురుష్ కనీసం కోటి రూపాయలు కుడా కలెక్ట్ చేయలేక పరుగును ఆపేసింది. ఇక ఆదిపురుష్ ఫస్ట్ వీక్ ఎండ్ అయ్యే సరికి వరల్డ్ వైడ్ గా 178 కోట్ల షేర్ వసూలు చేయగా, 359కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 242కోట్ల టార్గెట్ కి ఈ సినిమాకి ఇంకా 64 కోట్లయినా కావాలి. కానీ పరిస్థితి చూస్తుంటే ఆదిపురుష్ ఇక్కడితో తన పరుగు ముగించేలా ఉంది. అయితే రెండో వారం పెద్దగా అంచనాలున్న సినిమాలు ఏవి రాకపోవడంతో బహుశా కొన్ని చోట్ల ఈ సినిమాను చూసే అవకాశం ఉంది. మరి చూద్దాం ఆదిపురుష్ మరో రెండో వీకెండ్ ని ఏమైనా క్యాష్ చేస్కుంటాడా లేక 7రోజులకే పరుగును ముగిస్తాడా?

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు