Chandu mondeti: ఎపిక్ బ్లాక్ బస్టర్ మహానటి జోడీ రిపీట్ అవుతుందా?

కీర్తి సురేష్… పేరుకు కోలీవుడ్ నటి. కానీ, కీర్తి కట్టు, బొట్టు చూస్తే అచ్చం తెలుగింటి అమ్మాయిలా కనిపిస్తుంది. అందుకే కోలీవుడ్ ప్రేక్షకుల కంటే తెలుగు ప్రేక్షకులే కీర్తిని ఎక్కువగా అభిమానిస్తారు. అందుకే ఈ స్టార్ హీరోయిన్ కి తెలుగులోనే ఎక్కువగా అవకాశాలు వస్తున్నాయి. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబుతో వచ్చిన సర్కారు వారి పాట, నేచురల్ స్టార్ నానితో వచ్చిన దసరా సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయో అందరికీ తెలిసిందే.

అయితే కీర్తి సురేష్ కు ఎన్ని హిట్స్ వచ్చినా, మహానటి అంతటి పేరు రాలేకపోతుంది. ఇప్పటికి కూడా కీర్తిని మహానటి కీర్తి సురేష్ అనే అంటారంటే, మహానటి సినిమా ఈ కోలీవుడ్ బ్యూటీకి ఎంతటి గుర్తింపు తెచ్చిపెట్టిందో తెలుస్తుంది. మరోసారి మహానటి లాంటి సినిమా చేయాలని కీర్తి ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే మహానటి జోడీ రిపీట్ అవుతుందని తెలుస్తుంది. మహానటిలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో కనిపించిన నాగ చైతన్య.. ఓ సందర్భంలో కీర్తి సురేష్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ జోడీ ఈ సారి కలిసి పూర్తి సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. నాగ చైతన్య కస్టడీ తర్వాత చందూ మొండేటితో ఓ సినిమా చేయబోతున్న సంగతి విధితమే. గతంలో చందూ మొండేటి – నాగ చైతన్య కాంబినేషన్ లో ప్రేమమ్, సవ్యసాచి లాంటి సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో హ్యాట్రీక్ మూవీ రాబోతుంది. కాగా, ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం చిత్ర యూనిట్ సెర్చ్ చేస్తుందట. ముందుగా అనుపమ పరమేశ్వరన్ ను ఎంపిక చేసినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా, కీర్తి సురేష్ వైపునకు చిత్ర యూనిట్ మొగ్గుచూపిస్తున్నట్టు తెలుస్తుంది. కీర్తి సురేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని తెలుస్తుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment New

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు