BoyapatiRapo: తొందరపడుతున్న రామ్.. అనుకున్న టైమ్ కంటే ముందుగానే..

బోయపాటి శ్రీను రామ్ పోతినేని కాంబో లో ఒక పవర్ఫుల్ మాస్ సినిమా తెరకెక్కుతుందన్న విషయం తెలిసిందే. రామ్ బర్త్ డే కానుకగా విడుదలైన ఈ సినిమా టీజర్ హై ఓల్టేజ్ యాక్షన్ తో నిండి ఉండి ప్రేక్షకులకు మాస్ ట్రీట్ ఇచ్చింది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చుట్టూరి నిర్మిస్తున్నాడు. ఇక రీసెంట్ గా మైసూర్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకున్న చిత్ర యూనిట్ హైదరాబాద్ కి చేరుకుంది.

ఇంకా టైటిల్ కూడా నిర్ణయించని ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ఎనభై శాతం షూటింగ్ ముగించుకుంది. “బోయపాటిరాపో” అన్న వర్కింగ్ టైటిల్ తోనే ఉన్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల చేస్తామని టీజర్ లో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాను ప్రీ పోన్డ్ చేసి కాస్త ముందుగానే మాస్ ప్రేక్షకులకు కనువిందు చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం సినిమా టాకీ పార్ట్ దాదాపుగా పూర్తయిపోయిందందువల్ల ఈ సినిమాను సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నామని చిత్ర యూనిట్ ప్రకటించారు. పంట పొలాల్లో పంచ కట్టుతో కూల్ గా కూర్చున్న రామ్ పోస్టర్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి ఈ విషయం చెప్పారు. రీసెంట్ గా వస్తున్న సినిమాల్లో ప్రకటించిన డేట్ కి ముందుగానే విడుదల అవుతున్న సినిమా ఇదే కావచ్చు.

ఇక బోయపాటి రామ్ సినిమాకి “స్కంధ” అనే టైటిల్ పరిశీలనలో ఉంది. దాదాపుగా ఈ టైటిల్ ని ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. మరి దసరా పోటీ నుండి తప్పుకున్న ఈ సినిమా వినాయక చవితి పోటీకి రానుంది. ఈ సినిమాతో పాటు జవాన్, టిల్లు స్క్వేర్ కూడా విడుదల అవనున్నాయి. జులై మొదటి వారంలో ఈ సినిమా టైటిల్ తో పాటు ఒక లిరికల్ సాంగ్ ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు చిత్ర యూనిట్.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు