Ram Gopal Varma: స్టంటా… టాలెంటా ?

రామ్ గోపాల్ వర్మ , షార్ట్ కట్ లో ఆర్జీవీ. కానీ గుర్తింపు మాత్రం షార్ట్ కట్ లో రాలేదు. శివ, క్షణక్షణం, అంతం, గాయం, సత్య, గోవింద గోవిందా, సర్కార్ లాంటి సంచలనమైన సినిమాలు రామ్ గోపాల్ వర్మను ఒక స్థాయిలో నిలబెట్టాయి. ఇప్పటికి రామ్ గోపాల్ వర్మ మీద ఎంతో కొంత పాజిటివ్ ఫీల్ ఉంది అంటే, దానికి కారణం వర్మ చేసిన ప్రీవియస్ వర్క్స్ వలనే అని చెప్పొచ్చు. తెలుగు సినిమా ఒక మూస ధోరణిలో నడుస్తున్న తరుణంలో, శివ సినిమాతో ఒకడు వచ్చి తెలుగు సినిమాను పరుగులు పెట్టించాడు. శివ సినిమాలో డైలాగ్ లా చెప్పాలంటే, “ఆడే రామ్ గోపాల్ వర్మ”.

కేవలం సంచలనమైన సినిమాలు చేయడమే కాకుండా, వర్మ ఆలోచనలు కూడా సంచలనాత్మకంగానే ఉంటాయి. రాము సినిమాలకే కాకుండా రాముయిజం ఎపిసోడ్స్ కి కూడా ఫ్యాన్స్ ఉంటారు. కొన్నింటిని క్వశ్చన్ చెయ్యడం, ఆ క్వశ్చన్ లో కూడా లాజిక్ ఉండటమే రాము కి అభిమానులను తెచ్చిపెట్టింది. ఫ్రెడరిక్ నీట్షే, అయాన్ రాండ్, ఓషో వంటి రచనలును చిన్న ఏజ్ లోనే చదవడం వలనే రామ్ గోపాల్ వర్మ ఆలోచనలు సాధారణ మనుషులు కంటే భిన్నంగా ఉంటాయి.

ఏదేమైనా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ సినిమాలన్ని పబ్లిసిటీ స్టంట్స్ అని చెప్పొచ్చు. ఒకప్పుడు అద్భుతమైన సినిమాలు తీసి దాదాపు 50 మంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడన్ని నాసిరకం సినిమాలు తీస్తున్నాడు అనేది వాస్తవం. అంతేకాకుండా ట్విట్టర్ లో కొందరు వ్యక్తులు పైన, కొన్ని రాజకీయ పార్టీలు పైన పర్సనల్ అటాక్స్ చెయ్యడంతో వర్మ పైన కొంతశాతం ఇష్టం తగ్గింది చాలామందికి. ఐన ఇవన్నీ వర్మ పట్టించుకోడు అనుకోండి. కానీ ఆర్జీవీ నుంచి ఒక ప్రాపర్ ఫిల్మ్ బయటకు వస్తే చూసి తరించాలి అనేది చాలామందికి తీరని కోరిక.

- Advertisement -

లక్ష్మీస్ ఎన్టీఆర్, అమ్మ రాజ్యంలో కడపబిడ్డలు లాంటి సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ దగ్గరపడుతున్న తరుణంలో వ్యూహం అనే మరో సినిమాను సిద్ధం చేస్తున్నాడు. ఇది ఆర్జీవీ మరో పబ్లిసిటీ స్టంటా… లేకపోతే నిజంగా ఎవరు ఊహించని విధంగా తన వ్యూహం తీర్చి దిద్ది తన టాలెంట్ చూపిస్తాడా అనేది తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు వేచిచూడక తప్పదు. ఇకపోతే వ్యూహం సినిమా ట్రైలర్ రేపు రిలీజ్ కానుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు