SPY: ‘ఆదిపురుష్’ ఫినిష్ – మరి మిస్టరీ వర్కౌట్ అవుతుందా..?

సినిమా అంటే ఒక ఆర్ట్ గా పరిగణించే రోజులు ఎప్పుడో అంతరించిపోయాయి. ప్రస్తుతం సినిమా అంటే ఒక వ్యాపారం మాత్రమే. అప్పట్లో బి.ఎన్ రెడ్డి, ఎల్. వి ప్రసాద్ వంటి నిర్మాతలు సినిమాను కేవలం వ్యాపారంగానే కాకుండా సినిమా మీద ప్యాషన్ తో సినిమాలు చేసేవాళ్ళు. ప్రస్తుతం పెట్టుబడి పెట్టే స్తోమత ఉంటే చాలు సినిమా నాలెడ్జ్ లేనివాళ్లు కూడా నిర్మాతలుగా మారుతున్నారు. ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాల సంఖ్యతో పాటు ఫ్లాప్స్ కూడా ఎక్కువ అవ్వటానికి ఇదే కారణం అని చెప్పవచ్చు. ఇటీవల పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో రూపొంది ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఆదిపురుష్ సినిమా ఇందుకు సరైన ఉదాహరణ అని చెప్పవచ్చు.

విపరీతమైన హైప్ తో మినిమమ్ 1000కోట్ల గ్రాస్ టార్గెట్ గా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే నుండి నెగిటివ్ టాక్ తో పాటు తీవ్ర విమర్శలు ఎదుర్కొని బ్రేక్ ఈవెన్ సాధించటానికి కూడా కష్టపడుతున్న పరిస్థితి తలెత్తింది. ఆదిపురుష్ సినిమా ఫెయిల్యూర్ అవ్వటానికి ప్రధాన కారణం రామాయణం లాంటి ఎపిక్ స్టోరీని సినిమాటిక్ లిబర్టీ పేరుతో ఇష్టమొచ్చినట్టు మార్పులు చేసి చిత్రీకరించటమే అని చెప్పాలి. ఈ సినిమా నిర్మాతలు రామాయణాన్ని జాతి ఎమోషన్ అన్న విషయం మరచి కేవలం ఒక కథావస్తువుగా మాత్రమే చూశారు కాబట్టి ఫలితం ఇలా వచ్చింది. ఇదిలా ఉండగా ఇండియన్ హిస్టరీలో బిగ్గెస్ట్ మిస్టరీగా ఉన్న సుభాష్ చంద్రబోస్ అంతర్ధానం ఆధారంగా రూపొందిన ‘స్పై’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కార్తికేయ2 ద్వారా పాన్ ఇండియా హిట్ అందుకున్న నిఖిల్, డైరెక్టర్ గా మారిన ఎడిటర్ గ్యారీ కాంబినేషన్లో రూపొందింది స్పై సినిమా. పలు కారణాల వల్ల డిలే అవుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు జూన్ 29న విడుదలకు సిద్ధమైంది. అయితే, ఎవరూ ఊహించని విధంగా ఆదిపురుష్ మొదటివారం ముగిసేసరికే కలెక్షన్స్ లో హ్యుజ్ డ్రాప్ నమోదు కావటం స్పై సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల విడుదలైన స్పై సినిమా ట్రైలర్ కూడా సినిమాపై ఆసక్తి పెంచటంతో హడావిడిగా రిలీజ్ అవుతున్నా కూడా ఈ సినిమాకు డీసెంట్ బజ్ క్రియేట్ అయ్యింది. దరిదాపుల్లో పెద్ద సినిమాలేవీ రిలీజ్ లేవు కాబట్టి స్పై సినిమాకు ఫస్ట్ డే గనక పాజిటివ్ టాక్ వస్తే, పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంది.

- Advertisement -

నిఖిల్ సరసన హీరోయిన్ గా నటించిన ఐశ్వర్య మీనన్ పాత్రతో సహా ఇతర ప్రధాన పాత్రలు పోషించిన అభినవ్ గోమతం, మకరంద్ దేశ్ పాండే క్యారెక్టర్లు కూడా ఈ సినిమాలో కీలకంగా ఉండనున్నాయని తెలుస్తోంది ట్రైలర్ చూస్తుంటే. మరో పక్క, 4వ రోజు నుండే ఆదిపురుష్ థియేటర్లు ఖాళీ అవ్వటంతో మల్టీప్లెక్స్ లలో స్క్రీన్ల సంఖ్య కూడా తగ్గించిన నేపథ్యంలో స్పై సినిమాకి థియేటర్ల సమస్య కూడా ఉండే అవకాశం లేదు.

ఈ క్రమంలో వివాదాలతో సతమతమై చివరి వరకు అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా లేదా అన్న సస్పెన్స్ నడిచిన ఈ సినిమాకి ఆదిపురుష్ రూపంలో ఇన్ని పాజిటివ్ అంశాలు కలిసిరావడం ఒకరకంగా మంచి శకునం అనే చెప్పాలి. మరి, కార్తికేయ లాంటి మీడియం రేంజ్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న నిఖిల్ కి స్పై రూపంలో మరొక పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుతుందా లేదా వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు