Game Changer: రామ్ చరణ్ రెడీ – ఇకనైనా శంకర్ స్పీడ్ పెంచుతాడా..?

RRR సినిమాతో బ్లాక్ బ్లాక్ బస్టర్ అందుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలం కిందట షూటింగ్ మొదలైన ఈ సినిమా ఈ పాటికి పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ పలు కారణాల వల్ల వాయిదా పడి డిలే అవుతూ వస్తుంది. శంకర్ సైమల్టేనియస్ గా కమల్ హాసన్ తో ఇండియన్2 ప్లాన్ చేయటం గేమ్ చేంజర్ సినిమా కంటే ఎక్కువ ఇండియన్2 సినిమా మీదనే దృష్టి పెట్టడమే ఈ జాప్యానికి కారణంగా అని చెప్పవచ్చు. ఇటీవలే తండ్రి అయిన రామ్ చరణ్ గేమ్ చేంజర్ షూటింగ్ లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడని సమాచారం. గేమ్ చేంజర్ సినిమా తర్వాత బుచ్చిబాబుతో సినిమా స్టార్ట్ చేయాలనీ ప్లాన్ చేస్తున్న చరణ్ వీలైనంత త్వరగా గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నాడట.

మొదట్లో 2024 సంక్రాతి రిలీజ్ కి ప్లాన్ చేసిన ఈ సినిమా కనీసం సమ్మర్ కి కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపించట్లేదు. ఒకవేళ జులైలో షెడ్యూల్ ప్రారంభమైతే, శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి జెట్ స్పీడ్ లో పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేస్తే తప్ప సమ్మర్ కి రిలీజ్ వీలుపడే అవకాశం లేదు.ఈ నేపథ్యంలో ఇండియన్2 కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న శంకర్, గేమ్ చేంజర్ షూటింగ్ స్పీడ్ పెంచుతాడా అన్నది ప్రశ్నగా మారింది.

గేమ్ చేంజర్ షూటింగ్ బ్రేక్ పడటం వల్ల వచ్చిన గ్యాప్ లో రామ్ చరణ్ బుచ్చిబాబుతో చేయబోయే సినిమా స్టోరీకి సంబందించిన స్క్రిప్ట్ కూడా ఫైనలైజ్ చేశాడట. చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్న ఈ సినిమా కోసం బుచ్చిబాబు మాస్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ని గ్రాండ్ గా ప్లాన్ చేశాడని టాక్ వినిపిస్తోంది. మరి, RRR తర్వాత గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ ఇంట కూతురు జన్మించిన వేళా విశేషం కలిసొచ్చి వరుస బ్లాక్ బస్టర్స్ అందుకోవాలని ఆశిద్దాం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు