Om Raut: ఆదిపురుషుడికి కష్టకాలం… కాపాడటానికి ఎవరూ రారే ?

బాక్సాఫీస్ రికార్డులు బద్దల్… పాన్ ఇండియాలో కొత్త రికార్డులు… అంటూ థియేటర్ బరిలోకి వచ్చిన ఆదిపురుషుడికి కనీసం బ్రేక్ ఈవెన్ అందటం కూడా కష్టమే అన్నట్టు తయారైంది పరిస్థితి. భారీ అంచనాలు… ఎన్నో రికార్డులపై కన్నేసిన ఈ ఆధునిక రామాయణం కథ దాదాపు ముగిసింది. ఈ వారం ముగిసేసరికి ఆదిపురుష్ సినిమాకి 178 కోట్ల షేర్, 359కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 242 కోట్ల భారీ బ్రేక్ ఈవెన్ పాయింట్ తో బరిలోకి దిగిన ఆదిపురుష్ లాభాల బాట పట్టాలంటే, మరో 64 కోట్ల షేర్ రావాలి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తే అది చాలా… కష్టం.

డిజిటల్, టెలివిజన్ హక్కుల పేరుతో నిర్మాతలకు ఇప్పటికే లాభాలు రావొచ్చు. కానీ, థియేట్రికల్ రన్‌లో వచ్చిన కలెక్షన్ల ఆధారంగానే ఒక సినిమాను హిట్టా…? ఫట్టా…? అని నిర్ణయిస్తారు. అలా చూస్తే… ఆదిపురుష్ దాదాపు ఫట్ట్ అనే చెప్పాల్సి వస్తుంది. అయితే, ఈ మూవీ రిలీజ్‌కి ముందు ఆధ్యాత్మికంగా, రాజకీయంగా చాలా మంది ప్రముఖులు మద్దత్తుగా నిలిచారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అయితే ఏకంగా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్నజీయర్ స్వామి హాజరై, సినిమాను ప్రమోట్ చేశాడు. చిన్న జీయర్ స్వామి రాకతో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్… ఆధ్యాత్మిక సభగా మారిపోయిందని అప్పట్లో కామెంట్స్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.

ఒక్క చిన్న జీయర్ స్వామిజీయే కాదు… బ్యాక్ ఎండ్ లో ఓ జాతీయ పార్టీ, అయోధ్య రామ మందిరం ప్రధానార్చకులతో పాటు జాతీయ స్థాయిలో పేరు మోసిన ఆధ్యాత్మిక వేత్తలు కూడా డైరెక్ట్ గా, ఇన్ డైరెక్ట్ ఆదిపురుష్‌ను ప్రమోట్ చేశారు. “ఇది సినిమా కాదు… భవిష్యత్తు”. “ప్రతి భారతీయుడి కథ” లాంటి బలైమన నినాదాలతో ప్రజల్లోకి తీసుకెళ్లారు. అందువల్లే ఈ సినిమాకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయని చెప్పొచ్చు.

- Advertisement -

అయితే ఆదిపురుష్ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చిన సమయంలో… ఇలా ప్రమోషన్స్‌కు అండగా నిలిచిన వారంతా ఒక్క సారిగా మాయమైపోయారు. ఒక్క వారానికి థియేట్రికల్ రన్ ముగిసిపోతున్నా… అండగా నిలవడానికి ఆలోచిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆధ్యాత్మిక సభగా మార్చిన చిన్న జీయర్ స్వామీ వారు కూడా కనిపించడం లేదు. ఇది ఆదిపురుష్ డైరెక్టర్, నిర్మాతలకు ఒక రకంగా షాకింగ్ అనే చెప్పొచ్చు. ఎవరినైతే నమ్ముకుని ఇంత బడ్జెట్ పెట్టారో… ఇంత గ్రాండ్ గా రిలీజ్ చేశారో… వారే ఇప్పుడు తప్పుకున్నారు. తప్పుకోవడమే కాదు… ఆదిపురుష్ ను ఆడనివ్వకుండా చేస్తున్నారని నిర్మాతలు వాపోతున్నారని బీ టౌన్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు