Jee Karda: బోల్డ్ సీన్స్ చేస్తే తప్పేంటీ అంటున్న మిల్కీ బ్యూటీ..?

గత కొంత కాలంగా హీరోయిన్ అవకాశాలు సన్నగిల్లిన మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు ఓటీటీలో వరుస వెబ్ సిరీస్ లు చేస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం తమన్నా నటించిన ‘జీ కర్దా’ సిరీస్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుండగా, తన ప్రియుడు విజయ్ తో కలిసి నటించిన లస్ట్ స్టోరీస్2 కూడా రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఇప్పటిదాకా అడపాదపడ గ్లామర్ షో చేసిన తమ్ము, ఈ రెండు సిరీస్ లలో బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించి అందరికీ షాక్ ఇచ్చింది.

ముఖ్యంగా లస్ట్ స్టోరీస్2 లో విజయ్ తో చేసిన బోల్డ్ సీన్స్  గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఇదే అంశం ఫై మీడియా తమన్నాని ప్రశ్నించగా అంతే బోల్డ్ గా రియాక్ట్ అయ్యింది. కథ డిమాండ్ చేసినప్పుడు బోల్డ్ సీన్స్ లో నటిస్తే తప్పేంటని మీడియానే తిరిగి ప్రశ్నించింది మిల్కీ బ్యూటీ తమన్నా. బోల్డ్ సీన్స్ ని కథలో భాగంగానే చూడాలని, వాటిని వేరు చేసి చూడకూడదని చెప్పుకొచ్చింది.

లస్ట్ స్టోరీస్2 లో ప్రియుడు విజయ్ తో కలిసి బోల్డ్ సీన్స్ లో నటించటం పై కూడా స్పందించిన తమన్నా, విజయ్ తో ఆ సీన్స్ చేసేప్పుడు చాలా సేఫ్ గా ఫీలయ్యానని వెల్లడించింది. ఈ సిరీస్ లో నటించే సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని, త్వరలోనే తమ రిలేషన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళబోతున్నారని కూడా చెప్పుకొచ్చింది.

- Advertisement -

మొత్తానికి కెరీర్ ఎండ్ అయిపోయింది అనుకున్న దశలో బోల్డ్ సీన్స్ తో వేడి  పుట్టిస్తూ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమైందని చెప్పాలి. అయితే, ఓటీటీలో వస్తున్న కంటెంట్ లో బూతు శృతి మించుతోందని విమర్శలు వస్తున్న తరుణంలో తమన్నా నటించిన లిస్ట్ స్టోరీస్2 ఏ మేరకు అలరిస్తుందో వేచి చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు