Power Star: పవన్ రాజకీయాల్లో బిజీ – అయినా ఓజి స్పీడ్ తగ్గట్లేదుగా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలకు కొంత గ్యాప్ ఇచ్చి వరుసగా సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. పవన్ లైనప్ లో హరిహర వీరమల్లు, బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి సినిమాలు ఉన్నాయి. వీటన్నిటిలో అభిమానులు ఓజి కోసమే ఎక్కువగా ఎదురు చూస్తున్నారు ఇందుకు కారణం ఈ సినిమా కథ గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ లో రూపొందటం ఒకటైతే, ఆ తర్వాత దర్శకుడు సుజిత్ మరొక కారణం అని చెప్పవచ్చు. ఆ మధ్య సుజిత్ రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియో షూటింగ్ స్టార్ట్ కాకముందే ఈ సినిమాకు కావాల్సినంత హైప్ క్రియేట్ చేసింది.

పవన్ లైనప్ లో ఉన్న మిగతా సినిమాల కన్నా ఈ సినిమాపైనే ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తున్నాడని కూడా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పొలిటికల్ మీటింగ్స్ లో బిజీగా ఉన్నప్పటికీ ఓజి షూటింగ్ కొనసాగుతోంది.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న షెడ్యూల్ ఈ నెల 24తో పూర్తి కానుండగా, జులై 9నుండి మరో షెడ్యూల్ స్టార్ట్ అవనుందని, ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ లేకుండానే షూట్ జరగనుందని సమాచారం అందుతోంది.

పవన్ కళ్యాణ్ పొలిటికల్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యాక కొంత భాగం షూటింగ్ జరగనుందని తెలుస్తోంది. డిసెంబర్ లో రిలీజ్ కి ప్లాన్ చేసిన ఈ సినిమాను అనుకున్న సమయానికి కచ్చితంగా రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అయితే, సీజీ వర్క్ ఎక్కువ అవసరం ఉన్న ఈ సినిమాకు పోస్ట్ ప్రొడక్షన్ కి ఎక్కువ సమయం పట్టే ఛాన్స్ ఉంది కాబట్టి షూటింగ్ జెట్ స్పీడ్ లో పూర్తి చేస్తోంది సినిమా యూనిట్. మరి, పవన్ లైనప్ లో ఉన్న సినిమాలు అన్నిటికంటే ఫ్యాన్స్ ఎక్కువ హోప్స్ పెట్టుకున్న ఓజి సినిమా ఏ మేరకు అలరిస్తుందో అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు