Pawan kalyan’s OG: థాయిలాండ్ కు పవన్ కళ్యాణ్ – 30 రోజుల పాటు అక్కడే ?

Pawan kalyan’s OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొందర్లోనే థాయిలాండ్ కు వెళ్లనున్నారని సమాచారం అందుతోంది. దాదాపు 30 రోజుల పాటు పవన్ కళ్యాణ్ థాయిలాండ్ లోనే ఉండబోతున్నారట. అయితే ఇదేదో పొలిటికల్ పని మీద పవన్ థాయిలాండ్ కు వెళ్తున్నారని అనుకుంటే పప్పులో కాలు వేసినట్టే, ఎందుకంటే ఆయన వెళ్ళేది పొలిటికల్ మీటింగ్స్ పని మీద కాదు ఆయన లేటెస్ట్ సినిమా అయిన ఓజి సినిమా పని మీద ఆయన వెళ్తున్నట్టు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఓజి సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. దానయ్య డివివి నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే యాభై శాతం షూటింగ్ కంప్లిట్ చేసుకుంది. అతితక్కువ సమయంలోనే మెజారిటీ షూటింగ్ పార్ట్ ను కంప్లిట్ చేసిన డైరెక్టర్ సుజీత్, ఓజి సినిమాలో ఉండే ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను థాయిలాండ్ లో ప్లాన్ చేసాడట.

ఇక పవన్ కళ్యాణ్ కు ఈ సినిమా కంప్లిట్ చేయడం ఇప్పుడు అత్యవసరం అవడంతో థాయిలాండ్ కు వెళ్లి షూటింగ్ చేయడానికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ విదేశాలకు వెళ్లి షూటింగ్ చేసిన దాఖలాలు లేవు. ఆయన పొలిటికల్ మీటింగ్స్ కారణంగా పవన్ కళ్యాణ్ ఇండియాలోనే ఉండటం అనివార్యమైంది. దాంతో ఆయన నటిస్తున్న అన్ని సినిమాల షూటింగ్స్ హైదరాబాద్ లోనే చేసేవాళ్ళు , అయితే పవన్ కళ్యాణ్ కంబ్యాక్ తరువాత మొదటిసారి ఫారన్ వెళ్లి షూట్ చేస్తుండటంతో ఈ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు