OG: “ఫైర్ స్ట్రోమ్” రాకకి ముహూర్తం ఫిక్స్!

OG teaser update:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ ఇయర్ సెలబ్రేషన్ ఆఫ్ ది ఇయర్ గా మారేలా ఉంది. ఎందుకంటే నాలుగు సినిమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ అందులో ఒక సినిమా రిలీజ్ చేసేసాడు కూడా. ఆయన ప్రత్యేక పాత్రలో మేనల్లుడితో కలిసి నటించిన “బ్రో” జులై లో రిలీజ్ అయిపొయింది. ఇక ఇప్పుడు మరో మూడు సినిమాలతో రచ్చ చేసేందుకు సిద్ధమయ్యాడు. అందులో క్రిష్ తో చేస్తున్న హరిహర వీరమల్లు టీజర్ రిలీజ్ అయ్యి హైప్ ఎక్కించగా, రెండు నెలల కిందట హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ ని కూడా రిలీజ్ చేసి కిక్కెకించాడు.

ఇప్పుడు పవన్ తో ఓజి చేస్తున్న సుజీత్ ఏకంగా హైప్ తో పిచ్చెక్కించేలా ఉన్నాడు. పవన్ చేస్తున్న సినిమాల్లో అన్నిటికంటే ఎక్కువ హైప్ ఉన్న సినిమా “OG”. సాహో డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ లోను ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. దానికి తోడు సినిమాలో టెక్నిషియన్స్, ఇంకా నటీనటుల సెలెక్షన్స్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లాయి.

ఇక ఇప్పుడు ఫైర్ స్ట్రొమ్ ని ఎదుర్కోవడానికి సిద్ధం కమ్మని మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఓజి వస్తున్నదంటూ ఒక పవర్ ఫుల్ స్టిల్ తో అనౌన్స్ చేసారు. ఆ స్టిల్ లో దూరంగా తన గ్యాంగ్ తో OG కొందరు రౌడీలను చంపి వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఆ స్టిల్ బ్యాక్ నుండే ఉన్నా చూడ్డానికి స్టైలిష్ గా ఉంది.

- Advertisement -

అయితే పవర్ స్టార్ బర్త్ డే రోజు రాబోతున్న ఆ అప్డేట్ టీజరే అయ్యుంటుందని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఇదే నిజమైతే ఆ రోజు పీకే ఫ్యాన్స్ కి డబుల్ బొనాంజా ఖాయం. ఇక ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ తో పాటు అర్జున్ దాస్, శ్రియ రెడ్డి, ప్రకాష్ రాజ్, హరీష్ ఉత్తమన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. డివివి ఎంటరైన్మెంట్స్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు