MEGA 157 strong buzz: బింబిసార డైరెక్టర్ తో మెగా స్టార్ సినిమాకు ముహూర్తం ఫిక్స్

MEGA 157 strong buzz

మొత్తానికి బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ రెండవ సినిమా పట్టాలెక్కింది. గత కొద్దీ రోజులుగా బింబిసార డైరెక్టర్ తో మెగా స్టార్ చిరంజీవి సినిమా చేయబోతున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తుండగా, ఈ రూమర్స్ అన్నింటికీ చెక్ పెడుతూ త్వరలోనే ఈ మెగా కాంబినేషన్ నుంచి క్రేజీ అప్డేట్ రాబోతున్నట్టు తెలుస్తోంది.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై మెగా స్టార్ చిరంజీవి రాబోయే చిత్రానికి నవంబర్ లో ముహూర్తం ఫిక్స్ అయినట్టు సమాచారం అందుతుంది. ఇక ఈ సినిమాను గతేడాది బింబిసార సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న మల్లిడి వశిష్ఠ తెరకెక్కించనున్నట్టు సమాచారం.

బింబిసార సినిమా తరువాత మల్లిడి వశిష్ఠ బింబిసార పార్ట్ 2 చేయవలసి ఉండింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. దాంతో ప్రస్తుతం బింబిసార పార్ట్ 2 ను అదే సినిమాకు విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ గా పని చేసిన అనిల్ పాదూరి తెరకెక్కించనున్నాడు.

- Advertisement -

కాగా మల్లిడి వశిష్ఠ బింబిసార ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో మెగా స్టార్ చిరంజీవి ను డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసాడు ఈ యువ దర్శకుడు. అయితే మెగా స్టార్ చిరంజీవి, మల్లిడి వశిష్ఠకాంబినేషన్ లో రాబోయే సినిమా కూడా సోషియో ఫాంటసీ చిత్రమేనని ఫిలిం నగర్ టాక్ వినిపిస్తుంది.

మెగా స్టార్ గతంలో చేసిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను పోలి ఈ సినిమా ఉండబోతున్నట్టు సమాచారం అందుతోంది. మెగా స్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ సినిమా భోళా శంకర్ ఆగస్ట్ 11న రిలీజ్ అవబోతుంది. ఈ సినిమా తరువాత మెగా స్టార్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమా అనంతరం మల్లిడి వశిష్ఠ సినిమా ప్రారంభమవబోతునట్టు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు