Bimbisara :మెగాస్టార్ – మల్లిడి వశిష్ట్ మూవీ క్రేజీ అప్డేట్

గతేడాది వచ్చిన సర్ప్రైజింగ్ హిట్ సినిమాలలో బింబిసార సినిమా ఒకటి. కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ తెరకెక్కించాడు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

కళ్యాణ్ రామ్ హోమ్ బ్యానరైన ఎన్టీఆర్ ఆర్ట్స్ పై ఈ సినిమాను కొసరాజు హరికృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మించగా. సంయుక్త మీనన్, క్యాథరిన్ లు కళ్యాణ్ రామ్ కు జోడిగా నటించారు. ఇక ఈ సినిమా హిట్ తో ఓవర్ నైట్ లో టాప్ డైరెక్టర్ల లిస్ట్ లోకి వెళ్ళిపోయాడు యంగ్ డైరెక్టర్ మల్లిడి వశిష్ట్. బింబిసార సినిమాతో సర్వత్రా ప్రశంషలు అందుకున్న వశిష్ట్, ఆయన నెక్స్ట్ మెగా స్టార్ చిరంజీవితో చేయనున్నాడనే వార్త గత కొద్దీ రోజులుగా వినిపిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. కాగా ఇటీవలనే ఈ సినిమాకు సంబందించిన ఓ క్రేజీ న్యూస్ లీక్ అయ్యి, నెట్ లో వైరల్ అవుతుంది.

నిజానికి డైరెక్టర్ వశిష్ట్ బింబిసార సినిమా తరువాత ఆ సినిమాకు పార్ట్2 కూడా చేయవలసి ఉండగా కొన్ని కారణాల ఆయన ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఇక తరువాత మెగా స్టార్ కి కథ వినిపించిన వశిష్ట్ తన కథతో చిరంజీవిని ఇంప్రెస్ చేసాడు. దాంతో ఈ ప్రాజెక్ట్ ఒకే అయింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మితమవబోతున్న ఈ సినిమా అక్టోబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లబోతుందని టాక్ వినిపిస్తోంది. కాగా ఈ సినిమా కూడా బింబిసార లాగే సోషియో ఫాంటసీ సినిమా అని, చిరంజీవి గతంలో నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలో ఈ సినిమాను మల్లిడి వశిష్ట్ తీర్చి దిద్దనున్నడని సమాచారం.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు