Pawankalyan: “తొలిప్రేమ” చిగురించి నేటికీ పాతికేళ్ళు..

“తొలిప్రేమ”.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చి పెట్టిన తొలిచిత్రం. అప్పటివరకు మెగా స్టార్ చిరంజీవి తమ్ముడిగానే ఇండస్ట్రీ లో గుర్తింపు పొందుతున్న పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో యూత్ ఐకాన్ గా సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అప్పటివరకు డీసెంట్ సినిమాలతో అన్నయ్య అభిమానుల్ని ఫ్యామిలీ ప్రేక్షకులని అలరించిన పవన్ కళ్యాణ్ యూత్ కి ఫేవరేట్ స్టార్ గా మారింది “తొలిప్రేమ” చిత్రం నుండే. ఆ తొలిప్రేమ చిత్రం చిగురించి నేటికీ సరిగ్గా పాతికేళ్ళు అయింది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలు చెప్పుకుందాం.

టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చి అప్పటికి రెండేళ్లే అవుతుంది. హీరోగా మూడు చిత్రాల అనుభవం తప్ప ఏమిలేదు. అటు కరుణాకరన్ కొత్త డైరెక్టర్. ప్రొడ్యూసర్ రాజు కి కూడా కొత్త సినిమా. ఇలా పెద్దగా ఇండస్ట్రీ లో అనుభవం లేని మేకర్స్ కలిసి తీసిన ఈ చిత్రం 1998 జులై 24న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో పలు రికార్డులను తిరగరాసింది.

పవన్ కళ్యాణ్ హీరోగా తొలి బ్లాక్ బస్టర్ అందుకోవడమేగాక, ఫస్ట్ హ్యాట్రిక్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. అంతే కాదు నటన పరంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాతో మరో మెట్టు పైకెక్కాడు. లైఫ్ అంటే లక్ష్యం లేని “బాలు” అనే కుర్రాడిగా, వన్ సైడ్ ప్రేమికుడిగా, ఒక మంచి అన్నయ్యగా, మంచి ఫ్రెండ్ గా విభిన్న కోణాల్లో పవన్ కళ్యాణ్ నటన అద్భుతం. ఇక హీరోయిన్ కీర్తి రెడ్డి తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది. ఇప్పటికి తెలుగులో హీరోయిన్ ఎంట్రీల్లో బెస్ట్ సీన్ అంటే తొలిప్రేమ గురించే చెప్తారు. ఆ రేంజ్ లో ఒక ఏంజిల్ లా అప్పటి యూత్ గుండెల్లో పాతుకుపోయింది కీర్తి.

- Advertisement -

ఇక తొలిప్రేమ హిట్ కావడానికి ఎన్నిటికంటే పెద్ద కారణం పాటలు. తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ “దేవా” అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రాణం పోయగా, ఎస్పీ బాలు గాత్రం గుండెల్ని హత్తుకుంది. పాటలు ఇప్పుడు వింటున్నా సరే అదే ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఆరోజుల్లోనే 21 కేంద్రాల్లో డైరెక్ట్ గా 100 రోజులాడిన తొలిప్రేమ, 2 కేంద్రాల్లో రెండు వందల రోజులాడింది.

ఇక “తొలిప్రేమ” పాతికేళ్ళు పూర్తైన సందర్భంగా రీసెంట్ గా కొన్ని రోజుల ముందే ఈ సినిమాని జూన్ 30 న రీ రిలీజ్ చేయడం జరిగింది. ఇన్నేళ్ల తర్వాత రీ రిలీజ్ అయినప్పటికీ ఆ రోజు ఎలాంటి జోష్ తో ఆడియన్స్ ఎంజాయ్ చేసారో, ఇప్పుడు కూడా అదే రేంజ్ లో ఎంజాయ్ చేసారు. రీ రిలీజ్ లో కూడా తొలిప్రేమ 1.52 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేయడం విశేషం.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు