Boxoffice: బేబీ రికార్డు వసూళ్లు.. ట్రిపుల్ బ్లాక్ బస్టర్

టాలీవుడ్ లో ఈ మధ్య భారీ అంచనాలతో విడుదలైన చిన్న సినిమా ఏదైనా ఉంది అంటే అది “బేబీ” అనే చెప్పాలి. చిన్న సినిమా అయినా, భారీ ప్రమోషన్స్ తో రిలీజ్ అయి పెద్ద సినిమాల లెవెల్లో కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతుంది ఈ సినిమా. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులర్ అయిన వైష్ణవి చైతన్య హీరోయిన్ గా ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ లు హీరోలుగా రూపొందిన ఈ సినిమాను సాయి రాజేష్ డైరెక్ట్ చేసాడు.

జులై 14 న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ భారీ ఓపెనింగ్స్ సాధించింది. 8 కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అవగా, డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు చేకూరుస్తూ వర్షాకాలంలో కలెక్షన్ల వరద పారించింది. తాజాగా ఈ సినిమా 10రోజుల కలెక్షన్స్ వివరాలు వచ్చాయి. ఏరియా వారీగా ఆ లెక్క చూస్తే ఒక్క నైజాంలోనే 12 కోట్ల షేర్ వసూలు చేయగా సినిమాకి దాదాపు 35శాతం ఇక్కడి నుండే లాభం రావడం విశేషం.

ఇక ఆంధ్ర ప్రదేశ్ నుండి 15 కోట్లు, కర్ణాటక, ఓవర్సీస్ కలిపి మరో 4కోట్లు రాగా టోటల్ గా 10రోజులలో బేబీ ప్రపంచ వ్యాప్తంగా 31 కోట్లకి పైగా షేర్ సాధించగా, 60.40 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయిన బిజినెస్ లెక్కన చూస్తే బేబీ మూడు రెట్లు ఎక్కువ వసూలు చేసి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక జులై 28న “బ్రో” సినిమా రిలీజ్ అయ్యే వరకు బేబీ కి కలెక్షన్లు వస్తాయని చెప్పొచ్చు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు