Rajnikanth : జైలర్ కు సెన్సార్ షాకింగ్ రిపోర్ట్

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తోన్న లేటెస్ట్ సినిమా జైలర్ రిలీజ్ కు ముస్తాబవుతోంది. ఇటీవలనే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా రజని కాంత్ అభిమానులకు షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే..

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. తమిళ్ రాక్ స్టార్ అనిరుధ్ మ్యూజిక్ ఈ సినిమాకు అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పాటలు యూట్యూబ్ మరియు ఇతర స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ లలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుండగా, సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమాను బారి బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

డార్క్ యాక్షన్ చిత్రాలను మంచి ఎమోషన్ తో తెరకెక్కించగలిగా నైపుణ్యం ఉన్న దర్శకుడు నెల్సన్ ఈ సినిమాను యాక్షన్ ప్రధానంగా తెరకెక్కించినట్టు తెలుస్తోంది. సెంట్రల్ జైలు లో ఒక ముఠా నాయుడిని తప్పించడానికి వివిధ గ్రూపులు చేసే ప్రయత్నాన్ని, ఒక సాధారణ జైలు వార్డెన్ ఎలా ఎదుర్కొన్నాడనే అనే పాయింట్ తో నెల్సన్ ఈ చిత్రాన్ని మలిచినట్టు సమాచారం.

- Advertisement -

దాదాపు 2 గంటల 49 నిమిషాల రన్ టైం తో జైలర్ సినిమా లాక్ అయింది. ఇక ఈ సినిమా పోస్టర్స్ లో టీజర్ లో చూపించినట్టు వైలెన్స్ ప్రధానంగా ఉండబోతుందనుకుంటే సినిమా అసలు ఆ జానర్ లోనే కాకుండా కాన్సెప్ట్ ప్రధానంగా సాగుతున్నట్టు సెన్సార్ టీం వెల్లడిస్తూ రజని అభిమానులకు షాక్ ఇచ్చింది. ఇక ఈ సినిమా గురించి సెన్సార్ ఇంట్రెస్టింగ్ విషయాలను బయట పెట్టింది. ఫ్యామిలీ అంత కలిసి చూసే విధంగా జైలర్ సినిమా ఉండబోతుందని తెలియపరుస్తూ ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు