Ashwin: హిడింబ 4డేస్ కలెక్షన్స్.. లెక్క పర్లేదు గాని?

ప్రముఖ టాలీవుడ్ హీరో అశ్విన్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం “హిడింబ”. ఈ సినిమాను అనీల్ కన్నెగంటి డైరెక్ట్ చేయగా, SVK బ్యానర్ లో శ్రీధర్ గణపట్నం నిర్మించాడు. జులై 20న రిలీజ్ అయిన ఈ చిత్రం మిక్సడ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. అయితే దీనితో పాటే రిలీజ్ అయిన చిత్రాల్లో ఏ చిత్రానికి పాజిటివ్ టాక్ రాకపోవడంతో హిడింబ కు అడ్వాంటెజ్ అయ్యింది.

ఇక విడుదలైన మొదటి రోజు నుండి మామూలుగానే కలెక్షన్స్ రాబడుతున్నప్పటికీ వీకెండ్ ముగిసేసరికి ప్రతిరోజు కలెక్షన్స్ ని హోల్డ్ చేయడం విశేషం. తాజాగా ఈ సినిమా యొక్క నాలుగు రోజుల వసూళ్ల వివరాలు వచ్చాయి. ఏరియా వారి కలెక్షన్ల లెక్క చూస్తే.. నైజాం లో71 లక్షలు, ఆంధ్రప్రదేశ్ మొత్తం 87 లక్షలు, ఇతర రాష్ట్రాల మొత్తం కలిపి 28లక్షలు, టోటల్ వరల్డ్ వైడ్ గా 1.86కోట్ల షేర్, 4.20కోట్ల గ్రాస్ ని వసూలు చేసింది.

అయితే 3.20 కోట్ల బిజినెస్ చేసిన హిడింబ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా 1.34 కోట్ల గ్రాస్ రాబట్టాలి. అయితే ఈ సినిమాకి ప్రమోషన్స్ బాగా చేసి ఉంటె ఇంకొంచెం బెటర్ ఓపెనింగ్స్ రాబట్టేది. ఇక ఇప్పుడు ప్రమోషన్లు చేసినా లాభం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆడియన్స్ దృష్టి “బ్రో” చిత్రం పైనే ఉంది. ఉన్నంతలో బ్రో సినిమా వచ్చే వరకు హిడింబ కొద్దివరకు కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది. మరి మరో నాలుగు రోజుల వరకు హిడింబ ఎంతవరకు రికవరీ చేయగలుగుతుందో చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు