Prabhas: కల్కి రిలీజ్ డేట్ పై క్లారిటీ – అనుకున్నట్లే అయ్యింది..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ వైడ్ ప్రెస్టీజియస్ గా రూపొందుతున్న ప్రాజెక్ట్ ‘కల్కి 2898 AD’. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్ప్స్ రిలీజ్ అయ్యి సినిమాపై అంచనాలను పెంచింది. ఫస్ట్ లుక్ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కున్న సినిమా యూనిట్ గ్లిమ్ప్స్ తో స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చింది. ఈ సినిమా స్టార్ట్ అయిన నాటి నుండి 2024 సంక్రాంతికి రిలీజ్ అవుతుందంటూ వార్తలొచ్చినప్పటికీ గ్లిమ్ప్స్ లో రిలీజ్ డేట్ కనిపించకపోవటంతో సంక్రాంతికి రిలీజ్ అవుతుందా లేదా అన్న అనుమానం మొదలైంది, దీనికి తోడు రాజమౌళి కూడా ట్విట్టర్లో సినిమా యూనిట్ మీద రిలీజ్ డేట్ గురించి సెటైర్ వెయ్యటంతో ఆ అనుమానం ఇంకా పెరిగింది.

తాజాగా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ ఈ సినిమా రిలీజ్ డేట్ గురించి క్లారిటీ ఇచ్చాడు. వైజయంతి మూవీస్ తో సన్నిహితంగా ఉండే తమ్మారెడ్డి చెప్పాడంటే అది ఆల్మోస్ట్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అన్నట్టే లెక్క. ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న తమ్మారెడ్డి ప్రభాస్ కల్కి సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా రిలీజ్ ముందు సంక్రాంతికి అనుకున్న మాట వాస్తవమే కానీ, వీఎఫెక్స్ వర్క్, షూటింగ్ ఆలస్యం అవ్వటం వల్ల 2024 సంక్రాంతికి రిలీజ్ చేయటం కష్టం అని చెప్పాడు. హాలీవుడ్ రేంజ్ లో రూపొందనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ బిగినింగ్ కి కానీ, మేలో కానీ రిలీజ్ అవైతుందని క్లారిటీ ఇచ్చాడు.

కల్కి సినిమా అనౌన్స్ చేసిన నాటి నుండి ఇది టైమ్ ట్రావెల్ సినిమా అని, హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే, గ్లిమ్ప్స్ రిలీజ్ అయ్యాక ఎవరి ఊహకు అందని రేంజ్ లో ఉండనుందని స్పష్టం అయ్యింది. బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి వరుస డిజాస్టర్స్ ఎదుర్కున్న ప్రభాస్ కి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వటం కీలకంగా మారింది. మరి, ఇండియన్ సినిమా రేంజ్ ని ఇంకో మెట్టు ఎక్కిస్తుందని ఆశిస్తున్న కల్కి ఏ అంచనాలు అందుకుంటుందా లేదా చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు