Kushi movie press meet : పవన్ కళ్యాణ్ ఖుషి టైటిల్ నే పెట్టడానికి కారమేంటి ?

Kushi movie press meet

విజయ్ దేవరకొండ హీరోగా వస్తోన్న లేటెస్ట్ సినిమాకు ఖుషి అనే టైటిలే ఎందుకు పెట్టవలసి వచ్చిందనే ప్రశ్నకు ఎట్టకేలకు సమాధానం దొరికింది. మజిలీ సినిమా ఫేం శివ నిర్వాణ దర్శకత్వంలో రాబోతున్న ఖుషి సినిమా టైటిల్ వివాదం ఇప్పటిది కాదు.. సినిమా టైటిల్ ఎనౌన్స్ చేసినప్పటి నుంచి ఉంది. అయితే దీనిపై మూవీ టీం ఇప్పటివరకు నోరు విప్పలేదు. కాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఇక ఈ ప్రశ్నకు మూవీ టీం సమాధానం చెప్పక తప్పలేదు.

పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అతిపెద్ద హిట్టైన ఖుషి సినిమా గురించి అందరికి తెలిసిందే. తెలుగు సినిమాలల్లో ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచిపోయిన ఖుషి సినిమాకు ఇప్పటికి కూడా చాలా మంది అభిమానులున్నారు. ఇటీవలనే ఖుషి సినిమాను రీ రిలీజ్ చేసినపుడు కూడ ఈ సినిమాకు భారీ మొత్తంలో కలెక్షన్స్ వచ్చాయి. అయితే ఇలాంటి క్రేజీ రికార్డ్స్ ఉన్న పవన్ కళ్యాణ్ ఖుషి సినిమా పేరుతో ప్రస్తుతం విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్స్ గా సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఖుషి అనే టైటిలే ఎందుకు పెట్టారు. వేరే టైటిల్ పెట్టకుండా ఖుషి అనే టైటిలే పెట్టడానికి గల కారణమేంటని మీడియా ప్రతినిధి అడగగా ఆ ప్రశ్నకు డైరెక్టర్ శివ నిర్వాణ సమాధానం ఇచ్చాడు.

ఖుషి సినిమా ఫుల్ గా ఫన్ తో మిక్స్ అయిన ఒక లవ్ స్టోరీ. గతంలో తాను తీసిన సీరియస్ లవ్ స్టోరీ లాగా కాకుండా కంప్లిట్ గా సరదా, సరదాగా సాగుతుంది. సరదాగా ఉండే ఈ సినిమా కథకు అనుగుణంగా ఏ టైటిల్ పెట్టాలా అని అనుకున్నపుడు ఖుషి అనే టైటిల్ మైండ్ లోకి వచ్చింది. అందుకే ఖుషి అనే పెట్టాం. పాన్ ఇండియా సినిమా కాబట్టి అన్ని భాషలకు అర్థమయ్యేలా ఒకే టైటిల్ ఉండాలంటే కూడా ఖుషి అనే పదమే సరిగ్గా సరిపోతుందని అదే టైటిల్ ఉంచేసాము. అంతే తప్ప వేరే ఏ ప్రత్యేక కారణం లేదంటూ ఆయన ఆయన క్లారిటీ ఇచ్చారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు