Vijay devarakonda STRONG reply : ఖుషీలో సమంత కాకపోయుంటే ఏ హీరోయిన్ ను తీసుకునే వారు ?

vijay devarakonda STRONG reply

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి సినిమా సందడి మొదలైంది. దాదాపు 2 సంవత్సరాలుగా రిలీజ్ కు నోచుకోని ఈ సినిమా ఎట్టకేలకు నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 1 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అయింది. ఈ సందర్భంగా ఖుషి మూవీ టీం నిన్న మధ్యాహ్నం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించటంతో పాటు ప్రెస్ మీట్ లో మూవీ ముచ్చట్లను పంచుకున్నారు.

నిజానికి ఖుషి మూవీ ఇంత ఆలస్యం అవడానికి ప్రధాన కారణం సమంత అనారోగ్య సమస్యలని అందరికి తెలిసిందే. షూటింగ్ మొదలు పెట్టి, నలభై శాతం సినిమా కంప్లిట్ అయిన తరువాత సమంతకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఖుషి సినిమాకు బ్రేక్ పడింది. అయితే ఈ విషయానికి సంబంధించి మీడియా ప్రతినిధి విజయ్ ను సమంత వల్ల సినిమా ఆగిపోయినపుడు ఆమె కాకుండా వేరే హీరోయిన్ ను తీసుకొని మూవీ కంప్లిట్ చేయాల్సింది కదా అని అడగగా విజయ్ దేవరకొండ వెంటనే ఆ ప్రతినిధికి తనదైన స్టైల్ లో స్పందించాడు.

ఖుషి సినిమా ఒక ప్రేమ కథ చిత్రం. ఇలాంటి ఒక సినిమాకు స్ట్రాంగ్ పెయిర్ అనేది అవసరం అలాంటి చిత్రానికి సమంత కాకుండా వేరే హీరోయిన్ ను తీసుకుకోవాలనే ఆలోచన కూడా మాకు రాలేదు. ఆరాధ్య అంటే సమంతనే తన ఆరోగ్యం ఎప్పుడు బాగైతే అప్పుడే సినిమా చేద్దామని అనుకున్నాం కానీ తన కాకుండా వేరే హీరోయిన్ అనే ఆలోచన మా టీం లో ఎవరి మైండ్ లో లేదు అంటూ విజయ్ సమంత ను ఒక రేంజ్ లో పొగిడాడు. నిజానికి విజయ్, రష్మిక పేరు చెప్తాడేమో అని అందరు ఆశించగా, అలాకాకుండా విజయ్ దేవరకొండ సమంతనే తమ ఆరాధ్య అంటూ రిప్లై ఇచ్చాడు. దాంతో అందరు సైలెంట్ అయ్యారు.కాగా ఈవెంట్ మొత్తంలో సమంత లేని లోటు ఎక్కడ కనిపించనీయకుండా మొత్తం ప్రెస్ మీట్ ను విజయ్ ఒక్కడే హ్యాండిల్ చేసి అందరి ప్రశంషలు పొందాడు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు