Pushpa2 latest update : పుష్ప 2 రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

Pushpa2 latest update

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తోన్న లేటెస్ట్ సినిమా పుష్ప2 రిలీజ్ కోసం ఇండియా మొత్తం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే సుకుమార్ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా రిలీజ్ ఎప్పుడెప్పుడా అని అంత ఎదురుచూస్తుండగా ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ పై నిర్మాత నవీన్ యెర్నేని క్లారిటీ ఇచ్చాడు.

ఈ ఏడాది మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నుంచి వచ్చిన దాదాపు సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. ఇక లేటెస్ట్ గా వీరి ప్రొడక్షన్ నుంచి రాబోతున్న మరో సినిమా ఖుషి. విజయ్ దేవరకొండ సమంత లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ సినిమాను మజిలీ ఫేం శివ నిర్వాణ డైరెక్ట్ చేసాడు. ఇటీవలనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిన్న సాయంత్రం ఖుషి సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా ను నిర్వహించారు మూవీ యూనిట్. అయితే ఈ ఈవెంట్ లో పుష్ప2 సినిమా రిలీజ్ డేట్ ను నవీన్ యెర్నేని మీడియాతో షేర్ చేసాడు.

గతకొద్ది కాలంగా పుష్ప 2 సినిమా రిలీజ్ పై వస్తోన్న కథనాలన్నిటికి చెక్ పెడుతూ నిర్మాత నవీన్ యెర్నేని పుష్ప 2 సినిమా ఈ ఏడాది రావట్లేదని స్పష్టం చేసాడు. అయితే గతంలో ఈ పుష్ప 2 సినిమాను ఈ ఏడాది డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని పలు సందర్భాల్లో ప్రకటించిన మూవీ యూనిట్. లేటెస్ట్ గా ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు.ఇప్పటివరకు పుష్ప2 సినిమా షూటింగ్ కేవలం 40% మాత్రమే కంప్లిట్ అయిందని టాక్ వినిపిస్తోంది. పుష్ప పార్ట్ 1 కు వచ్చిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని పుష్ప ది రూల్ సినిమాను పార్ట్ 1 కు ఏమాత్రం తగ్గకుండాసుకుమార్ తెరకెక్కిస్తుండటంతో రిలీజ్ విషయంలో కాస్త ఆలస్యం అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ సంవత్సరం పుష్ప2 వస్తుందని ఎదురు చూస్తున్న బన్నీ అభిమానులకు నిజంగా ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు