Roopa Koduvayur: ఈ హీరోయిన్ ఒక డాక్టర్ కూడా అని తెలుసా?

Heroine Roopa Koduvayur is also a doctor

టాలీవుడ్ ఈ వారం రిలీజ్ అవుతున్న క్రేజీ సినిమాల్లో మిస్టర్ ప్రెగ్నెంట్ కూడా ఒకటి. ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ సోహెల్ హీరోగా నటించగా, హీరోయిన్ గా రూప కొడువయుర్ నటించింది. అయితే ఈ హీరోయిన్ కొత్తగా కనిపించేసరికి అందరూ ఈ అమ్మాయి మలయాళీ అమ్మాయి అనుకున్నారు. ఎందుకంటే పేరు కూడా కొంచెం అలాగే ఉంది. అయితే ఈ భామ మలయాళీ కాదు. స్వచ్ఛమైన తెలుగమ్మాయి. విజయవాడ కి చెందిన ఈమె ఇంతకు ముందే ఒక సినిమాలో హీరోయిన్ గా నటించింది.

అదే సత్యదేవ్ హీరోగా నటించిన “ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య”. ఈ సినిమా లాక్ డౌన్ లో ఓటిటి లో రిలీజ్ కావడం వల్ల ఎక్కువ మందికి తెలియలేదు. కానీ మెల్లిమెల్లిగా అందరికి తెలిసింది. అయితే ఈ అమ్మాయి హీరోయిన్ కాకున్నా ముందే ఒక డాక్టర్. ఈ విషయం కూడా చాలా మందికి తెలియదు. అది కూడా మాములు సర్జన్ కాదు. ఈమె ఒక “ఆంకాలజిస్ట్”. అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసే డాక్టర్ అన్నమాట. ఆమె తల్లి కోరిక మేరకు ఈమె డాక్టర్ అయ్యింది. రూప తల్లి కూడా ఒక క్యాన్సర్ పేషేంట్ కావడంతో తన తల్లికి వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదని తాను డాక్టర్ అయ్యిందని పలు ఇంటర్వ్యూ లలో చెప్పింది.

ఇక సినిమాలపై ఇష్టంతో 2020 లో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య లో నటించింది. ఇక ఆ సినిమాలో నటనకి బెస్ట్ డెబ్యూ హీరోయిన్ గా సైమా అవార్డు కూడా అందుకుంది. ఇక ఇప్పుడు మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమాతో మళ్ళీ ఆడియన్స్ ముందుకు వస్తుంది. ఆగష్టు 18న రిలీజ్ అవుతున్న ఈ సినిమా సరికొత్త జోనర్ లో ఉంటుందని మేకర్స్ అంటున్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు