Ketika sharma: సినిమాల కంటే వాటిపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుందిగా?

Ketika Sharma is more interested in photoshoots.

రొమాంటిక్ అనే చిన్న సినిమాతో హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయిన భామ “కేతిక శర్మ”. ఆ తర్వాత లక్ష్య, “రంగ రంగ వైభవంగా” సినిమాలతో ఆడియన్స్ ని పలకరించిన ఈ భామ, లేటెస్ట్ గా బ్రో సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఇప్పటివరకు తెలుగులో ఈ హీరోయిన్ కి సరైన బ్రేక్ రాలేదు. ఈమె నటించిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి. అయితే రీసెంట్ గా వచ్చిన బ్రో సినిమా డీసెంట్ యావరేజ్ సినిమా అవడంతో ఈ అమ్మడికి కెరీర్ గాడిలో పడుతుందని అనిపిస్తుంది.

ఇక బ్రో సినిమా తరువాత మరో రెండు చిన్న సినిమాల్లో ఆఫర్ దక్కించుకుందని టాక్. అయితే అఫిషియల్ గా ఈ అమ్మడి దగ్గరి నుండి కబురు అయితే రాలేదు. కానీ సోషల్ మీడియా లో మాత్రం ఈ రొమాంటిక్ భామ తెగ హల్చల్ చేస్తుంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో వారానికి మూడు నాలుగు ఫోటోషూట్లతో రచ్చ చేస్తుంది. ఇక ఈ హీరోయిన్ నటించిన సినిమాల కంటే ఫోటోషూట్లతోనే ఎక్కువ ఫాలోవర్లు వస్తున్నారని ఆ స్టిల్స్ ని బట్టే తెలుస్తుంది. ఏ ముహూర్తాన పూరి తన సినిమాకి రొమాంటిక్ అని పేరు పెట్టాడో ఈ హీరోయిన్ కూడా తన రొమాంటిక్ స్టిల్స్ తోనే ఆకట్టుకుంటుంది.

ఇక అల్ట్రా మోడ్రన్ డ్రెస్ అయినా, చీర కట్టులో అయినా, చుడిదార్ అయినా, ఎలాంటి కాస్ట్యూమ్స్ అయినా సరే ఈ అమ్మడి అందానికి ఫిదా అవ్వాల్సిందే. ఇక తాజాగా అనార్కలి డ్రెస్ లో సింపుల్ గా పోజులిచ్చినా ఆ స్టిల్స్ కి లక్షల్లో లైక్స్ వచ్చి పడుతున్నాయి. దీన్ని బట్టి కేతిక శర్మ తన సినిమాల కంటే ఫోటోషూట్ల పైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు ఉంది.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు