Bhola Shankar movie controversies: భోళా శంకర్ కు షాక్ ఇచ్చిన ఏపీ గవర్నమెంట్

Bhola Shankar movie controversies

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సినిమా భోళా శంకర్ కు ఏపీ గవర్నమెంట్ గట్టి షాక్ ఇచ్చింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్ ప్రధాన తారాగణంగా వస్తోన్న భోళా శంకర్ సినిమా టికెట్ కాస్ట్ పెంచాల్సిందిగా ఇటీవలనే భోళా శంకర్ మూవీ టీం ఏపీ ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. ఇక ప్రభుత్వం భోళా శంకర్ మూవీ టీం కు గట్టిగ రిప్లై ఇచ్చింది.

 

తమిళ్ లో సూపర్ హిట్టైన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన భోళా శంకర్ సినిమా ఇటీవల కాలంలో పలు అనవసర వివాదాల్లో చిక్కుకుంటుండటం అందరం చూస్తూనే ఉన్న. ఇటీవలనే డైరక్టర్ మెహర్ రమేష్ భోళా శంకర్ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో వేదాళం సినిమాను క్రింజ్ సినిమా అని అన్నందుకు గాను తమిళ్ తంబీలు మెహర్ రమేష్ పై తీవ్రంగా మండిపడ్డారు. దెబ్బకి మెహర్ రమేష్ ట్విట్టర్ లో అజిత్ అభిమానులను క్షమాపణ చెప్పే స్థాయిదాక ఈ వివాదం తీసుకెళ్లింది.

- Advertisement -

ఇక ఈ వివాదం సద్దుమణిగి అంత సజావుగా ఉందనుకునే సమయంలో మెగా స్టార్ చిరంజీవి భోళా శంకర్ ప్రి రిలీజ్ ఈవెంట్ లో మరియు వాల్తేరు వీరయ్య 200 డేస్ ఫంక్షన్ లలో ఏపీ గవర్నమెంట్ పై పలు వివాదాస్పద వ్యాఖ్యలుచేయడంతో భోళా శంకర్ మెడకు మరో కొత్త వివాదం వచ్చి పడింది.

ఇక ఇవన్నీ చాలవన్నట్టు తీసిన రీమేక్ సినిమాను పట్టుకొని ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర భోళా శంకర్ సినిమా టికెట్ కాస్ట్ పెంచాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరడం మరో ఎత్తయింది. ఇక దీనిపై ఏపీ ప్రభుత్వం స్పందిస్తూ.. చిరంజీవి చేసిన పలు వివాదాస్పద వ్యాఖ్యలు దృష్ట్యా భోళా శంకర్ సినిమా టికెట్ కాస్ట్ ను పెంచడానికి ప్రభుత్వం నిరాకరించింది. దాంతో భోళా శంకర్ సినిమాపై మరింత నెగిటివిటి వచ్చిందనే చెప్పాలి. ఇలా షాక్ ల మీద షాకులు వివాదాల నడుమ విడుదలవబోతున్న భోళా శంకర్ సినిమా ప్రేక్షకుల దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు