Movie Industry: మూవీ ఇండస్ట్రీలో పొలిటికల్ హీట్..

Political heat in the movie industry..

గత కొన్ని రోజుల నుంచి సినిమా ఇండస్ట్రీలో పొలిటికల్ హీట్ బాగా పెరిగిపోయింది. సినిమా ఇండస్ట్రీపై పొలిటికల్ లీడర్స్ కామెంట్స్ చేయడం, పొలిటికల్ లీడర్స్‌కు నటీనటులు కౌంటర్స్ ఇవ్వడం ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. రీసెంట్ టైమ్స్‌లో బ్రో మూవీలో ఓ క్యారెక్టర్‌ తనను పోలి ఉందని, తనను ట్రోల్ చేయడానికే పవన్ కళ్యాణ్ ఆ క్యారెక్టర్ ను సృష్టించారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.

దీనిపై మెగాస్టార్ చిరంజీవి ఓ కార్యక్రమంలో ఇన్‌డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చాడు. దీనిపై అటు వైసీపీ కార్యకర్తలు, ఇటు మెగా ఫ్యాన్స్ పోటాపోటీగా ఆందోళనలు చేస్తున్నారు. అలా తెలుగు ఇండస్ట్రీలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఇప్పుడు ఈ పొలిటికల్ హీట్ తమిళనాడుకి కూడా పాకింది.

జైలర్ ఆడియా లాంఛ్ ఈవెంట్‌లో రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పెద్ద దుమారాన్ని లేపుతున్నాయి.
“మొరగని కుక్కలేదు
విమర్శించని నోరు లేదు
ఇవి రెండూ జరగని ఊరు లేదు
మనం మన పని చూసుకుంటూ పోతూనే ఉండాలి”
అర్థమైందా రాజా?
అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్స్ ఎవరిని ఉద్ధేశించి అన్నారో అంటూ తెగ చర్చ జరుగుతుంది.

- Advertisement -

అయితే కొన్ని రోజుల క్రితం రజినీకాంత్ ఏపీకి వచ్చి చంద్రబాబు గురించి కొన్ని కామెంట్స్ చేశాడు. దీని తర్వాత ఏపీ మంత్రులు వరుసగా అసభ్యకరమైన పదాలతో రజినిని తిట్టిపోశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రజిని స్పందించలేదు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ మంత్రులను ఉద్ధేశించే అని తెలుస్తోంది. మరి దీనిపై ఏపీ వైసీపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు