Gunturu karam: టీజరో, సాంగో రిలీజ్ చేస్తారనుకుంటే ఏంటిది?

Gunturukaram Teaser Update When?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న “గుంటూరు కారం” 2024  సమ్మర్ లో రిలీజ్ కి రెడీ అవుతుందన్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు చాలా రోజుల తరువాత ఒక మాస్ సినిమా చేస్తుడడంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక అంతేకాక ఈ సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుడడం వల్ల కాంబో హైప్ కూడా బాగా పెరిగింది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ ,మరియు టీజర్లు సినిమాపై అంచనాలు పెంచేయగా షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటుంది.

ఇక తాజాగా మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్లగా, మహేష్ లేకపోయినా షూటింగ్ నిర్విరామంగా జరుగుతుంది. ఇక ఈరోజు మహేష్ బాబు బర్త్ డే కానుకగా అర్ధరాత్రి 12 గంటలకి మహేష్ ఫ్యాన్స్ కి సప్రైజ్ ఉందని మూవీ మేకర్స్ అనౌన్స్ చేసారు. అప్పట్నుంచి మహేష్ బాబు ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ఆతృతగా ఎదురుచూస్తూనే ఉన్నారు. అయితే ఏ టీజరో, లేక సాంగ్ రిలీజ్ చేస్తారో అనుకుంటే జస్ట్ మహేష్ బాబు లుంగీ లో ఉండి, బీడీ కాలుస్తున్న లుక్ రిలీజ్ చేసారు.

ఆ స్టిల్ చూడడానికి బాగానే ఉన్నా, మహేష్ బాబు ఫ్యాన్స్ మరింత ఎక్స్ పెక్ట్ చేసారు. ఇక తాజాగా మళ్ళీ ఒక అనౌన్స్ మెంట్ చేసింది చిత్ర యూనిట్. సాయంత్రం నాలుగు గంటలకి మరో మాస్ పోస్టర్ ని రిలీజ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. కానీ మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం సాంగ్ రిలీజ్ అవుతుందని ఎక్స్ పెక్ట్ చేసారు. మరి సాంగ్ రిలీజ్ చేయకపోయినా, కనీసం సాంగ్ అప్డేట్ అయినా ఇస్తారో లేదో చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు