BRO: ఆ స్టార్ హీరోతో నటించడమే నా డ్రీమ్- కేతిక శర్మ!

టాలీవుడ్ లో హిట్స్ లేకపోయినా తన గ్లామర్ తో వరుస ఆఫర్లు అందుకుంటుంది కేతిక శర్మ. ఢిల్లీ కి చెందిన ఈ భామ పూరిజగన్నాథ్ ఆడిషన్స్ లో నేరుగా తెలుగులోనే ఇంట్రడ్యూస్ అయ్యింది. ఫస్ట్ సినిమాయే స్టార్ డైరెక్టర్ అయినప్పటికీ డిజాస్టర్ అందుకుంది ఈ భామ. అయినా కూడా ఆ సినిమాలో తన గ్లామర్ తో ఆకట్టుకోవడంతో ఆఫర్లు వచ్చాయి. వరుస సినిమాలు చేస్తూ బిజీ అయింది.

ఇక ఈ ఏడాది “బ్రో” సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన నటించింది. ఆ సినిమా ఈ వారం విడుదలకు సిద్ధం అవుతుండగా, చిత్ర యూనిట్ తో కలిసి వరుస ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ సందడి చేస్తుంది ఈ భామ. అయితే ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఒక యాంకర్ కేతిక శర్మని ఏ హీరోతో వర్క్ చేయాలని ఉంది అని అడిగింది.

దానికి కేతిక శర్మ బదులిస్తూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ఫుల్ లెంగ్త్ రోల్ చేయాలని ఉంది. తనే నా డ్రీం హీరో అని చెప్పింది. ఇక ఒకేసారి పవన్ కళ్యాణ్ సినిమాలో ఆఫర్ వస్తే అందులో చిన్న రోల్ అయినా చేస్తా. కానీ రామ్ చరణ్ తో ఫుల్ మూవీ చేస్తా అని అంది. ఈ ఇంటర్వ్యూ లో సాయి ధరమ్ తేజ్ కూడా పాల్గొన్నాడు. ఇక వీళ్లిద్దరు నటించిన “బ్రో” ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ కాగా, 25న ప్రీ రిలీజ్ వేడుక జరుగనుంది. ఇప్పటికే ఈ వేడుకలో పాల్గొనడం కోసం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కి చేరుకున్నారు. ఇక జులై 28న “బ్రో” సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు