Pushpa2 : పెరిగిన షెకావత్ సార్ వ్యాల్యూ.. సుకుమార్ కి మరింత ప్రెజర్?

Pushpa2 : టాలీవుడ్ లో తెరకెకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్టులలో “పుష్ప ది రూల్” ఒకటి. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గరవుతున్న కొద్దీ సినిమాపై అంచనాలని పెంచేస్తుంది. ఈ సినిమా నుండి వచ్చే ఏ అప్డేట్ అయినా సెన్సేషన్ అవుతుంది. అయితే పుష్ప పార్ట్ వన్ లో ఎలాగైతే బలమైన హీరోకి అంతే స్ట్రాంగ్ విలన్లని చూపించాడో, రెండో పార్ట్ కి కూడా ఇంతకు మించి స్ట్రాంగ్ గా ప్రత్యర్ధులని చూపించాల్సి ఉంటుంది. పుష్ప రేంజ్ పెరిగిందని హీరోయిజం ఇస్తే, విలనిజం పండక సినిమా రొటీన్ అయిపోతుంది. ఇక పాన్ ఇండియా వైడ్ గా పుష్ప‌రాజ్-బ‌న్వ‌ర్ సింగ్ షెకావ‌త్ మ‌ధ్య అస‌లైన వైరం ఎలా ఉంటుంద‌న్న‌ది ప్రేక్షకులు ఆత్రుత గా ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ పార్ట్ లో రెండు పాత్రల‌కి ఈగో తో పగ పెంచి ముగింపు ప‌లికాడు సుకుమార్. ఇప్పుడా ఇద్ద‌రి మ‌ధ్యా ఈగో ఏ స్థాయిలో ఉంటుంద‌న్న‌ది పార్ట్-2 లో ర‌స‌వ‌త్త‌రంగా ఉండ‌బోతుంది. రెండు పాత్ర‌ల మ‌ధ్యా నువ్వా? నేనా? అన్న రేంజ్ లో వార్ న‌డుస్తుంది. ఇప్ప‌టికే ఆ రెండు పాత్ర‌ల‌కు సంబంధించి చాలా భాగం షూటింగ్ కూడా పూర్తి చేసారు. ఆగ‌స్టులో రిలీజ్ అవుతున్న నేప‌థ్యంలో దాదాపు ఫ‌హాద్ ఫాజిల్ పాత్ర‌కు సంబంధించి షూట్ కూడా ముగింపు ద‌శ‌లోనే ఉంటుంద‌ని అంతా భావిస్తున్నారు.

పెరిగిన షెకావత్ సార్ బ్రాండ్ వాల్యూ..

అయితే ఫ‌హాద్ పాత్ర షూట్ ఇంకా నెల రోజుల పాటు ఉంటుంద‌ని తాజాగా లీకైంది. ఇప్ప‌టికే ఫ‌హాద్ పై చాలా స‌న్నివేశాలు చిత్రీక‌రించినా షూట్ చేయాల్సిన భాగం మిగిలి ఉండ‌టంతో ముందుగా ఆయ‌న కేటాయించిన డేట్లు స‌రిపోవ‌డం లేదట‌. దీంతో అద‌నంగా నెల రోజులు కేటాయిస్తున్నాడుట‌. జూన్ 1-30వ తేదీ వ‌ర‌కూ తాను అందుబాటులో ఉంటాన‌ని సుకుమార్ కి ప్రామిస్ చేసారుట‌. ఇవ‌న్నీ కీల‌క స‌న్నివేశాలు కావ‌డంతో ఆ పార్ట్ షూటింగ్ అంతా సుకుమార్ ద‌గ్గ‌రుండి షూట్ చేస్తారని తెలుస్తోంది. బ‌న్నీతో కాంబినేష‌న్ సీన్స్ కూడా ఉన్నాయ‌ని స‌మాచారం. ఇదిలా ఉండగా రీసెంట్ గా వచ్చిన “ఆవేశం” సినిమాతో ఫహద్ ఫాజిల్ మార్కెట్ వ్యాల్యూ, క్రేజ్ కూడా డబుల్ అయింది. దీన్ని బట్టి పుష్ప లో ఫాఫా ని మరింత స్ట్రాంగ్ గా చూపించాల్సి ఉంటుంది. లేదంటే చూసే ప్రేక్షకులకి ఫాఫా కి ఎలివేషన్ తగ్గినట్టు బోర్ కొట్టే ఛాన్స్ ఉంది. ఫాఫా ని ఏమాత్రం తక్కువ చేసినా రొటీన్ మసాలా అయిపోతుంది. పైగా మలయాళం ఫ్యాన్స్ కూడా ఒప్పుకోరు.

సుకుమార్ కి ప్రెజర్..?

అయితే ఫహద్ ఇప్ప‌టికే ఈ సినిమాకి భారీ మొత్తం ఛార్జ్ చేసిన‌ట్లు వార్త‌లొచ్చాయి. రెండు భాగాల‌కు క‌లిపి ప్యాకేజ్ రూపంలో పారితోషికం మాట్లాడుకున్నారు. షెడ్యూల్ ప్రకారం పారితోషికం అంతా అందేసింది. కానీ తాజాగా నెల రోజులు ఎక్స్ ట్రా కేటాయిస్తున్నారు కాబ‌ట్టి అందుకు త‌గ్గ‌ట్టు అద‌నంగా చెల్లించాల్సిందే. ఇక మ‌ల‌యాళంలో ప‌హాద్ పేరున్న న‌టుడు. ఇటీవ‌లే ఆయ‌న న‌టించిన ఓ సినిమా భారీ వ‌సూళ్లు సాధించిన సంగ‌తి తెలిసిందే. పెరిగిన షెకావత్ సార్ రేంజ్ ని బట్టి స్ట్రాంగ్ గా చూపించాలి అంటే, సుకుమార్ స్క్రీన్ ప్లే ఎంత బలంగా ఉంటుందో అన్న ఆసక్తి నెలకొని ఉంది. హీరోల క్రేజ్ పై పాత్రల స్వభావంపై సుకుమార్ కి ప్రెజర్ ఎక్కువైంది. అయితే సుకుమార్ విలన్ తో ఒక్క ఫైట్ కూడా చేయించకుండా, హీరోని మించి స్ట్రాంగ్ గా చూపించగల సమర్థుడని తెలిసిందే. అయితే ఈ సినిమా పాన్ ఇండియా మూవీ కాబట్టి సందేహాలు రావడం కామనే. మరి పుష్ప ది రూల్ లో భన్వర్ సింగ్ షెకావత్ ని ఏ రేంజ్ లో చూపిస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు