Vinay Rai: ఆమె ప్రేమలో పడ్డ హనుమాన్ విలన్.. ఎవరంటే..?

Vinay Rai.. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఎప్పుడు ఎవరితో ప్రేమలో పడతారో చెప్పడం కష్టం.. అయితే అలా ప్రేమలో పడినవారు తమ బంధాన్ని బయటకు మాత్రం రివీల్ చేయరు. రహస్యంగా ప్రేమాయణం నడుపుతూ మీడియా కంటపడకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక సందర్భంలో అందరి దృష్టికి వచ్చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు తమకు నచ్చిన వారితో వెకేషన్ లకు , పార్టీలకు జంటగా వెళ్లి.. మీడియా కంట పడుతున్న విషయం తెలిసిందే.. ఇప్పుడు మరో జంట కూడా మీడియా కంటపడి వార్తల్లో నిలిచింది.. వారెవరో కాదు హనుమాన్ సినిమాతో ఓవర్ నైట్ లోనే భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న వినయ్ రాయ్.. ఈ సినిమాలో విలన్ గా నటించి తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను మెప్పించారు..

Vinay Rai: The Hanuman villain she fell in love with.. Who is..?
Vinay Rai: The Hanuman villain she fell in love with.. Who is..?

విమలా రామన్ తో ప్రేమలో పడ్డ వినయ్ రాయ్..

ఇదిలా ఉండగా తాజాగా ఈయన ఒక ప్రముఖ హీరోయిన్ తో ప్రేమలో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఆమె ఎవరో కాదు గ్లామర్ బ్యూటీగా పేరు దక్కించుకున్న విమలా రామన్… గత కొంతకాలంగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇకపోతే తాజాగా వీరిద్దరూ కలిసి చేసిన ట్రెండీ ఫోటోషూట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. ఈ వార్త కాస్త మరోసారి తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. కానీ ఈ బంధం పై వీరిద్దరూ అధికారికంగా ప్రకటించలేదు. అయితే తాజాగా గత కొన్నేళ్ళు ప్రేమాయణం లో మునిగి తేలుతున్న వీరిద్దరూ తమ బంధాన్ని మరో మెట్టు ఎక్కించాలని నిర్ణయించుకున్నారట. అందులో భాగంగానే పెద్దల అనుమతితో పెళ్లి చేసుకోవాలని కూడా ఇద్దరూ అనుకుంటున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..

ప్రేమే కాదు పెళ్లి కూడా..

ముఖ్యంగా వినయ్ , విమలా రామన్ ఇద్దరూ కూడా పలుమార్లు జంటగా మీడియా కంటపడ్డారు.. టూర్లు వెకేషన్ లు అంటూ ఎక్కడికెళ్ళినా వీరే.. ఇద్దరు కలిసి దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.. అందులో భాగంగానే ఇప్పుడు వీరి ప్రేమ బంధం గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి.. ఇకపోతే త్వరలోనే ఏడు అడుగులు వెయ్యబోతున్నారు అంటూ వీరి సన్నిహిత వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారికంగా ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

- Advertisement -

విమల రామన్ కెరియర్..

విమలా రామన్ విషయానికొస్తే మొదట మోడల్ గా కెరియర్ ఆరంభించిన ఈమె మలయాళం ఇండస్ట్రీ ద్వారా హీరోయిన్ గా అవతారం ఎత్తింది.. ఆ తర్వాత తెలుగులో గాయం -2 , ఎవరైనా ఎప్పుడైనా, చట్టం , నువ్వా నేనా , చుక్కల్లాంటి అబ్బాయి చక్కనైన అమ్మాయి , రాజ్, డ్యామ్ 999 వంటి చిత్రాలలో నటించింది.. అంతేకాదు పలు హిందీ సినిమాలలో ఐటెం సాంగ్ లలో కూడా నటించి మెప్పించింది.

వినయ్ రాయ్ విషయానికి వస్తే..

నీ వల్లే నీ వల్లే అనే సినిమా ద్వారా 2007లో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన.. ఈ సినిమాతో ఉత్తమ నటుడు జాబితాలో విజయ్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. తర్వాత ఎక్కువగా తమిళ్ చిత్రాలకే పరిమితమైన వినయ్ .. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన హనుమాన్ చిత్రంలో విలన్ గా నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. దాదాపు 15 సంవత్సరాల తర్వాత విలన్ గా అవతారం ఎత్తి తెలుగు ప్రేక్షకులను అలరించారు వినయ్ రాయ్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు