Double iSmart: ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ నుంచి క్రేజీ అప్డేట్‌..దీని తల్లి దిమ్మతిరిగింది

Double iSmart: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది యంగ్ హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి వారిలో హీరో రామ్ ఒక్కరు. హీరో రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో దాదాపు 20 సంవత్సరాలుగా కొనసాగుతున్నాడు. దేవదాసు సినిమాతో తెలుగులో హీరోగా పరిచయమయ్యాడు రామ్. ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా ఆఫర్లు వచ్చాయి.

ఇప్పటివరకు 20కి పైగా సినిమాలు చేశాడు రామ్. అయితే రామ్ కెరీర్లో… ఇస్మార్ట్ శంకర్ సినిమా బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో నభా నటేశ్, నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించారు. 2019 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ అందుకుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా సీక్వల్ రాబోతుంది.

డబుల్ ఇస్మార్ట్ పేరుతో ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే చాలా అప్డేట్లు వచ్చాయి. అయితే తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రం బృందం. ఈ సినిమా టీజర్ కు ముహుర్తం ఫిక్స్ అయింది. ఈ సినిమా టీజర్ ను మే 15వ తేదీన అంటే మరో మూడు రోజుల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. రామ్‌ పోతినేని బర్త్‌ డే మే 15వ తేదీన ఉంది. ఈ తరుణంలోనే అదే రోజున రామ్‌ కు గిఫ్ట్‌ ఇవ్వనుంది చిత్ర బృందం.

- Advertisement -

https://x.com/MattersOfMovies/status/1789514843122499597

https://x.com/MattersOfMovies/status/1789514843122499597

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు