Mother’s Day Movie Special : బెస్ట్ మదర్ సెంటిమెంట్ మూవీస్

Mother’s Day Movie Special : సృష్టికి మూలం అమ్మ అని చెబుతుంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో మదర్ ఇంపార్టెన్స్ ఏంటి అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. నేడు మదర్స్ డే సందర్భంగా వచ్చిన బెస్ట్ మదర్ సెంటిమెంట్ సినిమాలు గురించి ఒక లుక్కేద్దాం. మదర్ సెంటిమెంట్ సినిమాలు అనగానే అది ఒక సేఫ్ జోన్ అని చెప్పొచ్చు. ఈ జోనర్ లో వచ్చిన సినిమాలన్నీ కూడా దాదాపు మంచి హిట్లు సాధించాయి. ఇక మదర్ సెంటిమెంట్ సినిమాలు అనగానే తెలుగు వాళ్లకు అందరికీ టక్కున గుర్తు వచ్చే సినిమా “మాతృదేవోభవ”. అక్కడి నుండి లెక్కేసుకుంటే చాలా సినిమాలు అమ్మ కాన్సెప్ట్ తో వచ్చాయి. ఈ జనరేషన్ కి తెలిసిన సినిమాలంటే ప్రభాస్ నటించిన ఛత్రపతి, అలానే యోగి, ధనుష్ నటించిన రఘువరన్ బీటెక్, రవితేజ నటించిన అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, రీసెంట్ గా శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం తెలుగు ఆడియన్స్ కి బాగా గుర్తుండే సినిమాలు గురించి సినిమాలు చూసుకుంటే…

మాతృదేవోభవ..

సీనియర్ హీరోయిన్ మాధవి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని కే. అజయ్ కుమార్ దర్శకత్వం వహించగా, 1993 లో వచ్చిన ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ లో కన్నీళ్లు పెట్టుకొని ప్రేక్షకులు ఉండరు. అమ్మ కాన్సెప్ట్ తో వచ్చిన చిత్రాల్లో ఈ సినిమానే ముందుగా అందరికి గుర్తొస్తుంది.

అమ్మ రాజీనామా..

అమ్మ తన తల్లి బాధ్యతలకు రిటైర్మెంట్ ప్రకటిస్తే.. ఆ తల్లి బాధ్యతల నుండి తప్పుకుంటే ఒక కుటుంబానికి ఎలాంటి పరిస్థితి వస్తుందో అన్న నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించగా, ప్రధాన పాత్రలో ఊర్వశి శారద నటించారు.

- Advertisement -

అమ్మ చెప్పింది..

ప్రముఖ దర్శకుడు గుణ్ణం గంగరాజు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లో నటి సుహాసిని ప్రధానపాత్రలో అమ్మగా నటించగా, శర్వానంద్ ఆమె కొడుకుగా నటించారు. మానసిక ఎదుగుదల లేని కొడుకు కోసం తల్లి ఏమి చేసిందనేది ఈ చిత్ర నేపథ్యం. ఈ సినిమాలో క్లైమాక్స్ కూడా కంటతడి పెట్టిస్తుంది.

అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి..

రవితేజ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వం లో వచ్చిన ఈ చిత్రం కమర్షియల్ అయినా కూడా, తల్లీకొడుకుల బంధం ప్రధాన నేపథ్యంలో సాగుతుంది.

Mother's Day Movie Special Best Films

ఛత్రపతి..

అమ్మ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రాల్లో ఈ జెనరేషన్ లో ఛత్రపతి మూవీ చాలా మందికి ఫెవరేట్. చిన్నతనంలోనే ప్రమాదవశాత్తూ తల్లి కొడుకులు తప్పిపోతే, ఆ తల్లి కోసం కొడుకు ఎంతగా తల్లడిల్లుతాడో ఈ చిత్రంలో రాజమౌళి అద్భుతంగా చూపించారు. దీనికి సెమిలర్ గానే బాహుబలి నేపథ్యం కూడా ఉంటుంది.

రఘువరన్ బీటెక్..

కోలీవుడ్ స్టార్ ధనుష్ నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇంజనీరింగ్ చదివి ఖాళీగా ఉండే ఒక కుర్రాడు తనకు నచ్చిన పని మాత్రమే చేస్తానని కొన్ని ఉద్యోగాలను రిజెక్ట్ చేస్తున్న తరుణంలో తనకు తన నాన్నకు వచ్చిన గొడవ లో, వాళ్ళ అమ్మతో మాట్లాడటం మానేస్తాడు. ఆ తరుణంలో వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత ఆ కుర్రాడు ఎలా తన కెరీర్ ని సీరియస్ తీసుకున్నాడు అనేది ఈ సినిమా యొక్క కథాంశం. ఈ చిత్రంలో వచ్చే అమ్మ పాట చాలా మందికి ఫెవరేట్.

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్..

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా లో కూడా అమ్మ ప్రేమ గురించి బాగా చూపించారు. ఈ సినిమా నేపథ్యం అది కాకపోయినా, సినిమా కంటెంట్ పై కొన్ని ట్రోల్స్ వచ్చినా, ఈ సినిమా కూడా మదర్ సెంటిమెంట్ వాళ్ళ హిట్ అయిందని చెప్పవచ్చు.

ఒకే ఒక జీవితం..

శర్వానంద్ హీరోగా నటించిన ఈ మూవీ కూడా తల్లి కొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కింది. అక్కినేని అమల తల్లిగా నటించగా, ఆమె నటించిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ అలాగే, ఒకే ఒక జీవితం సినిమాల్లో మంచి పాత్రల్లో నటించారని చెప్పొచ్చు.

ఇవే కాక యమలీల, సింహరాశి, బిచ్చగాడు, అడవి దొంగ, అబ్బాయి గారు ఇలా చాలా సినిమాలు అమ్మ నేపథ్యంలో వచ్చి ఘన విజయం సాధించాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు