2 Years for Sarkaru Vaari paata: వన్ మ్యాన్ షో.. కలెక్షన్ ఎంతంటే..?

2 Years for Sarkaru Vaari paata.. మహేష్ బాబు చాలా కాలం గ్యాప్ తర్వాత నటించిన చిత్రం సర్కారు వారి పాట. పరుశురాం దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, 14 వీల్స్ ప్లస్ , జీ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో మహేష్ బాబు హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా.. సముద్రఖని, వెన్నెల కిషోర్ , సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలో నటించారు.. 2022 మే 12న విడుదలైన ఈ సినిమా వన్ మ్యాన్ షో గా నిలిచింది.. ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్ బాబు తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు..

మహేష్ బాబు వన్ మ్యాన్ షో..

2 Years for Sarkaru Vaari paata: One man show.. What is the collection..?
2 Years for Sarkaru Vaari paata: One man show.. What is the collection..?

అమెరికాలో మహి ( మహేష్ బాబు) ను మోసం చేసి కళావతి ( కీర్తి సురేష్) పదివేల డాలర్లు తీసుకుంటుంది ప్రేమ పేరుతో తనను మోసగించినట్టు మహికి అర్థం అవుతుంది.. కళావతిని డబ్బులు అడిగితే గొడవ పెట్టుకుంటుంది ..కళావతి తండ్రి రాజేంద్రప్రసాద్ దగ్గర డబ్బులు వసూలు చేయాలని మహి ఇండియాకి వస్తే.. ఆ తర్వాత ఏమైంది? అనేది సినిమా కథ.. ముఖ్యంగా ఎవరికి వారు తమ అద్భుతమైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.. ఇందులో మహేష్ హ్యాండ్సమ్ గా కనిపించడం.. కీర్తి సురేష్ ప్రేమ సన్నివేశాలలో కుర్రాళ్ళు కాస్త ఫిదా అయిపోయారు.. ముఖ్యంగా మొదటిసారి అప్పటివరకు సాంప్రదాయంగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ గ్లామర్ పెంచేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.. కీర్తి సురేష్ , మహేష్ బాబు మధ్య కెమిస్ట్రీ చాలా అద్భుతంగా వర్క్ అవుట్ అయింది.. అలాగే మహేష్ బాబు , వెన్నెల కిషోర్ మధ్య వచ్చే సన్నివేశాల కామెడీ టైమింగ్ కూడా సూపర్బ్ అని చెప్పాలి.. మొత్తానికైతే ఈ సినిమా వన్ మ్యాన్ షో గా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందని చెప్పవచ్చు

సర్కారు వారి పాట కలెక్షన్స్..

- Advertisement -

నైజాం – రూ.35.02 కోట్లు

సీడెడ్ – రూ.12.13 కోట్లు

ఉత్తరాంధ్ర – రూ.12.54 కోట్లు

ఈస్ట్ – రూ.8.96 కోట్లు

వెస్ట్ – రూ.5.65 కోట్లు

గుంటూరు – రూ.8.60 కోట్లు

కృష్ణ – రూ.6.32 కోట్లు

నెల్లూరు – రూ.3.70 కోట్లు

ఏపీ + తెలంగాణ – రూ.92.92 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ.7 కోట్లు

ఓవర్సీస్ – రూ.13.02 కోట్లు

వరల్డ్ వైడ్ – రూ.112.94 కోట్లు

ఇకపోతే ఈ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది .. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ రూ.121 కోట్లు రాబట్టాల్సి ఉండగా.. కేవలం రూ.112.94 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.. ఇక మొత్తానికైతే ఈ చిత్రం రూ.8.06 కోట్ల నష్టాన్ని బయ్యర్లకు మిగిల్చిందని చెప్పవచ్చు.. ఇకపోతే గత రెండేళ్ల క్రితం కరోనా కావడం పైగా ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్లు తగ్గిపోవడం వల్ల ఈ సినిమా నష్టం వచ్చింది. ఒకవేళ టికెట్లు రేట్లు గనుక అందుబాటులో ఉండి ఉంటే కచ్చితంగా ఈ సినిమా మరింతగా కలెక్ట్ చేసి ఉండేది.. మొత్తానికైతే అబౌవ్ యావరేజ్ రిజల్ట్ తో అప్పట్లోనే సరిపెట్టుకుంది ఈ సినిమా.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు