Game Changer: ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు

Game Changer: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పాన్ ఇండియా హీరోస్ లో రామ్ చరణ్ తేజ్ ఒకరు. చిరుత సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి హిట్టు అందుకొని, తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక మంచి హీరో దొరికాడు అనిపించుకున్నాడు. ఇక అప్పట్లో చాలామంది చరణ్ ఎంట్రీ కోసం ఎదురుచూసారు. దీనికి కారణం మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ పైన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. ఒకప్పుడు మెగాస్టార్ సినిమా అంటే టికెట్ దొరకడం అంత ఈజీ కాదు. క్యూలైన్లో ప్రేక్షకులు చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. అంత క్రేజ్ ఉండేది మెగాస్టార్ చిరంజీవి అంటే.

ఇకపోతే చిరుత సినిమా తర్వాత మగధీర అనే సినిమా తోనే స్టార్ హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ సాధించుకున్నాడు చరణ్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ ను నమోదు చేసింది. ఒక హీరోకి రెండో సినిమాతోనే ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు పడటం అనేది మామూలు విషయం కాదు. ఆ తర్వాత ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆరెంజ్ సినిమా అంతంత మాత్రమే ఆడింది. ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు పరవాలేదు అనిపించుకున్నాయి.

రామ్ చరణ్ హిట్స్

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ధ్రువ సినిమాతో మళ్లీ తన వేటను మొదలుపెట్టాడు రామ్ చరణ్ తేజ్. ఇకపోతే సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా చరణ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కేవలం హిట్ అవ్వడమే కాకుండా రంగస్థలం ముందు రంగస్థలం తరువాత అనేలా సినిమా నిలబడింది. రామ్ చరణ్ తేజ్ లోని ఒక పరిపూర్ణమైన నటుడును బయటకు తీసిన సినిమా రంగస్థలం. ఆ సినిమా సాధించిన విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

- Advertisement -

ఎదురుదెబ్బ

ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన సినిమా డిజాస్టర్ గానే మిగిలింది. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమా చరణ్ కి పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపుని తీసుకొని వచ్చింది. ఇక ప్రస్తుతం చరణ్ నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ఎదురు చూస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే ప్రస్తుతం చరణ్ చేస్తున్న సినిమా గేమ్ చేంజెర్.

అంచనాలన్నీ దీనిపైనే

శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పైన అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కొన్ని కారణాల వలన ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికీ సరైన రిలీజ్ డేట్ ఏంటో తెలియదు.

Ram Charan In Game Changer Movie
Ram Charan In Game Changer Movie

దర్శకుడు శంకర్ తెలుగులో తీస్తున్న మొదటి సినిమా ఇది. ఈ సినిమాకి సంబంధించి ఇంకా 45 రోజులు పెండింగ్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే శంకర్ దర్శకత్వం వహించిన భారతీయుడు 2 సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో శంకర్ ఈ సినిమాను ఎప్పుడు పూర్తి చేస్తాడు అని అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తుంది. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో అధికారక ప్రకటన రావాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు